మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 14, 2020 , 12:20:45

మ‌హిళ‌ గొంతులో ఏలిక‌పాము.. అది ఇంకా బ‌తికే ఉంద‌ట‌!

మ‌హిళ‌ గొంతులో ఏలిక‌పాము.. అది ఇంకా బ‌తికే ఉంద‌ట‌!

మ‌నిషి అనుమ‌తి లేకుండా నోట్లోకి ఏ ఆహార ప‌దార్థం వెళ్ల‌దు. అది ఆరోగ్యానికి మంచిదైనా, చెడైనా. విట‌మిన్ల కోసం బ‌తికే ఉన్న జీవుల్ని తిని  కొత్త వైర‌స్‌ల‌ను సృష్టిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు చైనానే. క‌నిపించిన ప్ర‌తి ప్రాణినీ ఆహారంగా మార్చేస్తున్నారు. స‌మ‌స్య‌ల్ని తీసుకొస్తారు. అలా తినే ఒక‌ మ‌హిళ చిక్కుల్లో ప‌డింది. గ‌త కొన్నిరోజులుగా గొంతు నొప్పి ఉండ‌డంతో వైద్యుడిని సంప్ర‌దించింది. గొంతును ప‌రిశీలించిన త‌ర్వాత డాక్టర్లు షాక్‌కు గుర‌య్యారు. గొంతులో ఉన్న ఏలిక‌పామును చూసి ఖంగుతిన్నారు. అది ఇంకా బ‌తికే ఉందని తెలిపారు.

ఏలిక‌పాము గొంతులోకి రావ‌డానికి కార‌ణం ఆమె తిన్న స‌ముద్రపు ఆహార‌మే. దాని పేరు సషిమీ చేప‌. ఇదంటే ఆసియా దేశ ప్ర‌జ‌ల‌కు చాలా ఇష్టం. ఇది మంచి టేస్ట్‌తో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్ర‌సాదిస్తుంది. అయితే ఈ చేప‌ను వండ‌కుండా ప‌చ్చిగానే తినేస్తారు చాలామంది. కాక‌పోతే దీనికి ఏలిక‌పాములు అల్లుకొని ఉంటారు. చేప‌ను తినేట‌ప్పుడు ఏలిక‌పాముల‌ను తీసేసి శుభ్రం చేస్తారు. ఆ మ‌హిళ తినే చేప‌లో ఒక ఏలిక‌పామును తీసేయ‌డం మ‌ర్చిపోయిన‌ట్లు ఉన్నారు. అది కాస్త ఆమె నోట్లోకి వెళ్లిపోయింది. అది క‌డుపులోకి వెళ్లి జీర్ణంకాకుండా అలానే గొంతులో ఇరుక్కుపొయి ఇబ్బంది పెట్టింది. ఈ అరుదైన కేసును అమెరికన్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్‌లో ప్రచురించారు. చూశారుగా.. ఏ ఆహారం ఎలా తినాలో అలానే వండుకొని తింటే ఎలాంటి ప్ర‌మాదానికి గుర‌వ్వ‌రు.


logo