శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 15, 2020 , 19:30:54

మీ కోసం పెండ్లి వాయిదా వేసుకున్నాం.. మా కోసం ఇంట్లోనే ఉండండి

మీ కోసం పెండ్లి వాయిదా వేసుకున్నాం.. మా కోసం ఇంట్లోనే ఉండండి

క‌రోనా కాలంలో డాక్ట‌ర్లే నిజ‌మైన హీరోలు. క‌రోనా వైర‌స్‌తో పోరాడుతున్న వైద్యులు, న‌ర్సుల‌తో స‌హా చాలామంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు వారి కుటుంబాల‌కు దూరంగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో వైద్యులుగా ఉన్న మాక్స్, గ్రెటా ఆదివారం ఏప్రిల్ 12న వివాహం చేసుకోవాలి. కాక‌పోతే హాస్పిట‌ల్‌లో రోగుల సంర‌క్ష‌ణ‌లో బిజీగా ఉన్నందున వారు త‌మ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.  "ఈ రోజు మనం పెళ్లి చేసుకోవాలి, కానీ బదులుగా" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 

చిత్రంలో ఇద్దరూ జెరాల్డ్టన్ ప్రాంతీయ హాస్పిట‌ల్‌ లోపల ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటూ చేతిలో ప్ల‌కార్డ్ ప‌ట్టుకొని ఉన్నారు. ప్ల‌కార్డుల‌ను జాగ్రత్తగా చూస్తే, "మేము ఈ రోజు వివాహం చేసుకోవాలి, కానీ బదులుగా, మేము మీ కోసం పనికి వెళ్ళాము. కాబట్టి మా కోసం మీరు ఇంట్లో ఉండండి" అని రాసి ఉంది. ఈ పోస్ట్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ జంట‌ను ఉత్సాహ‌ప‌ర‌చ‌డానికి వ‌ధువు, వ‌రుడు దుస్తులు తీసుకొచ్చారు స‌హోద్యోగులు.ఆ దుస్తుల‌తో దిగిన ఫొటోల‌ను కూడా పోస్ట్ చేశారు. వీరి త్యాగానికి నెటిజ‌న్లు కామెంట్ల రూపంలో అభినంద‌న‌లు తెలుపుతున్నారు.


logo