శనివారం 30 మే 2020
International - Apr 07, 2020 , 11:02:42

క‌రోనా సోకి యూకేలో భార‌త సంత‌తి వైద్యుడు మృతి

క‌రోనా సోకి యూకేలో భార‌త సంత‌తి వైద్యుడు మృతి

న్యూఢిల్లీ: భార‌త సంత‌తికి చెందిన ప్రముఖ వైద్యుడు, హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ జితేంద్ర కుమార్ రాథోడ్ యూకేలో క‌రోనా సోకి మృతిచెందారు. బ్రిట‌న్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌లో ఎంతో కాలం నుంచి అసోసియేట్‌ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహిస్తూ, ఎందరో ప్రముఖులకు వైద్య సేవలందించిన డాక్టర్‌ జితేంద్ర కుమార్‌ మంగ‌ళ‌వారం ఉద‌యం వేల్స్ యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచారు. 1977లో బాంబే యూనివర్శిటీలో వైద్యవిద్యను అభ్యసించిన జితేంద్ర కుమార్‌.. ఆ త‌ర్వాత యూకేకు వెళ్లి వైద్య రంగంలో దశాబ్దాలపాటు సేవలందించారు. తన ద‌గ్గ‌రికి వచ్చే రోగులకు చికిత్స అందించడంలో జితేంద్ర‌ ఎంతో శ్ర‌ద్ధ చూపేవార‌ని.. ఒక్క‌సారి ఆయ‌న ద‌గ్గ‌ర చికిత్స పొందిన రోగులు ఆ త‌ర్వాత కూడా ఆయ‌న‌ప‌ట్ల ఎంతో గౌర‌వ భావంతో ఉండేవార‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. జితేంద్రకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo