గురువారం 28 మే 2020
International - Apr 10, 2020 , 00:45:52

కరోనాతో ఇండోర్‌లో వైద్యుడి మృతి

కరోనాతో ఇండోర్‌లో వైద్యుడి మృతి

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ శతృఘన్‌ పంజ్వానీ (62) కరోనా బారినపడి గురువారం మరణించారు. దేశంలో కరోనాతో వైద్యుడు మరణించటం ఇదే తొలిసారి. ఆయనకు నాలుగు రోజుల కిందట  కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన ఓ కరోనా రోగికి చికిత్స చేస్తుండగా వైరస్‌ సోకినట్టు భావిస్తున్నామని ఇండోర్‌ డీఎంహెచ్‌వో ప్రవీణ్‌ జాదియా తెలిపారు. 


logo