బుధవారం 03 జూన్ 2020
International - Apr 09, 2020 , 13:20:26

రాయిపై వింత ఆకారం..ఏంటో చెప్పుకోండి..వీడియో

రాయిపై వింత ఆకారం..ఏంటో చెప్పుకోండి..వీడియో

ఓ రాయిపై న‌లుపు రంగులో వింత ఆకారం ఒక‌టి అని నెటిజ‌న్లలో తెగ ఆలోచ‌న‌లో ప‌డేస్తుంది. స్పైడ‌ర్ మ్యాన్-3, వీన‌మ్ చిత్రాల్లోని  గ్ర‌హాంత‌ర వాసిలా న‌ల్ల‌గా క‌నిపించే జీవి ఏంటా అని అంతా ఆలోచిస్త్నున్నారు. ఇది ఏంటో ఎవ‌రికైనా తెలుసా..? అంటూ స‌న్నీ అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ 14 సెక‌న్ల‌పాటు ఉన్న వీడియోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. వీడియో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి 50 వేల‌మందికిపైగా దీని గురించి మాట్లాడ‌టం ప్రారంభించారు. ఈ వీడియో కు 19.5 మిలియ‌న్ల వ్యూస్  వ‌చ్చాయి. వేల సంఖ్య‌లో ఆస‌క్తిక‌ర కామెంట్లు పెట్టారు. కొంత‌మందైతే వీన‌మ్ సినిమాలో సీన్ కు సంబంధించిన జిఫ్ ఫైల్ ను షేర్ చేశారు.

అసలు ఇంత‌కీ ఇదేంట‌నే క‌దా మీ డౌట్‌.. దీని పైరు బూట్‌లెస్ వార్మ్‌. 180 అడుగుల పొడ‌వు వ‌ర‌కు పెరిగి ప్ర‌పంచంలోనే పొడ‌వైన జంతువుల్లో ఇది ఒక‌టి. ఏవైనా జంతువులు బూట్ లెస్ వార్మ్ ద‌గ్గ‌ర‌కొస్తే..అది త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు విష‌పూరిత శ్లేష్మాన్ని స్ర‌విస్తుంది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo