శనివారం 06 జూన్ 2020
International - Apr 28, 2020 , 15:16:47

ఫాల్క‌న్ ప‌క్షి ఎంత దూరం వెళ్తుందో తెలుసా..?

ఫాల్క‌న్ ప‌క్షి ఎంత దూరం వెళ్తుందో తెలుసా..?

ఫాల్క‌న్ కుటుంబానికి చెందిన అమూర్ ఫాల్క‌న్ అనే ప‌క్షి గురించి ఖ‌చ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఉత్త‌ర చైనా, ఆగ్నేయ సైబీరియాల‌ను ఆవాసంగా చేసుకుని ఉండే ఈ ప‌క్షి చూడటానికి చిన్న‌గానే ఉంటుంది. కానీ ఎన్నో ఇది చాలా దేశాల స‌రిహ‌ద్దులు, తీర ప్రాంతాల‌ను దాటి వ‌స్తుందో తెలుసా..‌? చైనా నుంచి మంగోలియా, అరేబియా సముద్రం మీదుగా ఆఫ్రికాకు వెళ్తుంది.

ఆ త‌ర్వాత మంగోలియా నుంచి మ‌ళ్లీ మంగోలియా, సోమాలియా నుంచి హిమాల‌యాల మీదుగా భార‌త్ లోని నాగాలాండ్ రాష్ట్రానికి వ‌ల‌స వ‌స్తుంది. కొంత‌కాలం నాగాలాండ్ లో గ‌డుపుతుంది. ఈ ప‌క్షి ఒక‌సారి ప్ర‌యాణం ప్రారంభిస్తే 22వేల కిలోమీట‌ర్ల వ‌రకు దూరాన్ని క‌వ‌ర్ చేసుకుంటూ వెళ్తుంది. చిన్న‌గా ఉండే ఈ ప‌క్షి ఓ వండ‌ర్ అనే చెప్పాలి. 

2012 వ‌ర‌కు అమూర్ ఫాల్క‌న్ ప‌క్షులను వేటాడేవారు. కానీ ఆ త‌ర్వాత అది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. దీంతో ప్ర‌భుత్వం, ఎన్జీవోలు వాటిని కాపాడేందుకు ముందుకొచ్చాయి. అప్ప‌టినుంచి నాగాలాండ్ లో ప్ర‌తీ యేటా అమూర్ ఫాల్క‌న్ ఫెస్టివ‌ల్ నిర్విహిస్తుంటారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo