శుక్రవారం 27 నవంబర్ 2020
International - Oct 22, 2020 , 16:52:22

ట్రంప్‌కు ఓటేయొద్దు... ఓ వృద్ధురాలి చివ‌రి కోరిక ‌

ట్రంప్‌కు ఓటేయొద్దు... ఓ వృద్ధురాలి చివ‌రి కోరిక ‌

వాషింగ్ట‌న్ : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయ‌వ‌ద్ద‌ని ఓ వృద్ధురాలు త‌న సంస్క‌ర‌ణ స‌భ‌కు హాజ‌రైన వారిని కోరింది. అదేంటి చ‌నిపోయిన త‌ర్వాత అభ్య‌ర్థించ‌డం ఏమిటి అనుకుంటున్నారా? మ‌రేంలేదు ఆమె చ‌నిపోయేముందు ఓ లేఖ‌లో ఈ విష‌యాన్ని తెలిపింది. మిన్నెపోలిస్ ప్రాంతం ఇన్వ‌ర్ గ్రోవ్ హైట్స్‌కు చెందిన జార్జియా మే అడ్కిన్స్‌(93) సెప్టెంబ‌ర్ 28న సెయింట్ పాల్‌లోని యునైటెడ్ ఆస్ప‌త్రిలో గుండెపోటుతో మ‌ర‌ణించింది. కాగా సెయింట్ పాల్ పయనీర్ ప్రెస్‌లో ప్రచురించబడిన దాని ప్ర‌కారం త‌న ద‌హ‌న సంస్కారాలు ఎలా జ‌ర‌పాలో ఆమె ముందే తెలిపింది. 

కొవిడ్‌-19 ప్రోటోకాల్స్ పాటిస్తూ అక్టోబర్ 16 చర్చి సేవతో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాలంది. అదేవిధంగా త‌న స‌మాధిపై పుష్ప‌గుచ్ఛాలు ఉంచి పూల వ్యాపారిని బ్ర‌తికించేబ‌దులు అందుకు బ‌దులుగా డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయ‌వ‌ద్ద‌ని స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌ను కోరింది. బామ్మ అభ్యర్థన సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ పోస్టు ప‌లువురి నుండి ప్ర‌శంస‌లను ఆకర్షించగా మ‌రికొంద‌రు ఖండించారు. జార్జియాకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు, ఇద్ద‌రు స‌వితి కుమార్తెలు, 17 మంది మ‌న‌మ‌లు, మ‌న‌వ‌రాళ్లు, 24 మంది ముని మున‌మ‌లు, మ‌న‌వ‌రాళ్లు, ఓ ముని ముని మ‌న‌వ‌డు ఉన్నారు.