శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 28, 2020 , 02:11:29

లక్షణాలు లేకుంటే టెస్టు వద్దు!

లక్షణాలు లేకుంటే టెస్టు వద్దు!

  • మార్గదర్శకాలను సవరించిన అమెరికా సీడీసీ 

న్యూయార్క్‌: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ లక్షణాలు లేకుంటే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం అవసరంలేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలను సవరించింది. కరోనా సోకిన వ్యక్తులతో కలిసి సంచరించినవారు.. తమలో లక్షణాలు కనిపించనప్పటికీ కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలని గతంలో సీడీసీ సూచించింది. ప్రస్తుతం వీటిని సవరించింది. తాజా మార్గదర్శకాలు ప్రజల్లో తప్పుడు భావనను కలిగించే అవకాశమున్నదని శ్వేతసౌధం కరోనా కార్యదళం సభ్యుడు ఆంటోనీ ఫౌసీ చెప్పారు. 


logo