సోమవారం 25 జనవరి 2021
International - Jan 12, 2021 , 16:17:06

ఇండోనేషియా ప్ర‌మాదం.. దొరికిన బ్లాక్ బాక్స్‌

ఇండోనేషియా ప్ర‌మాదం.. దొరికిన బ్లాక్ బాక్స్‌

జ‌క‌ర్తా:  ఇండోనేషియా స‌మీపంలోని జావా న‌దిలో శ్రీవిజ‌య ఎయిర్ జెట్‌కు చెందిన విమానం కూలిన ఘ‌ట‌న‌లో 62 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ విమానానికి చెందిన బ్లాక్ బాక్సును డైవ‌ర్లు రిక‌వ‌రీ చేసిన‌ట్లు తెలుస్తోంది.  విమానం కూలిన ప్రాంతంలో వెతికిన డైవ‌ర్లు బ్లాక్ బాక్సు దొరికిన‌ట్లు స‌మాచారం. అయితే అది ఫ్ల‌యిట్ డేటా ప‌రిక‌రమా లేక కాక్‌పిట్ వాయిస్ రికార్డ‌రా అన్న విష‌యం స్ప‌ష్టంగా తెలియ‌దు.  ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న కోణాన్ని విశ్లేషించేందుకు బ్లాక్ బాక్సు డేటా కీల‌కం కానున్న‌ది. శ‌నివారం రోజున జ‌కర్తా నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్ష‌ణాల్లో భారీ వ‌ర్షంలో విమానం స‌మీప స‌ముద్రంలో కూలిపోయింది. బాక్ల్ బాక్సు కోసం సుమారు 160 మంది డైవ‌ర్లు స‌ముద్రంలో అన్వేషించారు. విమానం కూలిన ప్రాంతంలో సుమారు 3600 మంది రెస్క్యూ సిబ్బంది, 13 హెలికాప్ట‌ర్లు, 54 భారీ నౌక‌లు, 20 చిన్న బోట్ల‌తో గాలింపు చ‌ర్య‌లు సాగుతున్నాయి.    


logo