గురువారం 02 జూలై 2020
International - Jun 02, 2020 , 13:25:11

గల్ఫ్ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ

గల్ఫ్ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ

హైదరాబాద్ : కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పాటిస్తుండటంతో ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన గల్ఫ్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు బహ్రైన్ టీఆర్ఎస్ ఎన్నారై సెల్‌ ముందుకొచ్చింది. వారికి నిత్యావసర సరుకులు అందజేసి బాసటగా నిలిచారు.

ఈ సందర్భంగా బహ్రైన్ టీఆర్ఎస్ ఎన్నారై సెల్‌ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బోలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే గల్ఫ్ నుంచి తిరిగి వచ్చే పేదలకు ఉచిత క్యారంటైన్ సౌకర్యం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.


logo