బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 08:56:24

డిస్నీలో 28 వేల ఉద్యోగాల కోత‌

డిస్నీలో 28 వేల ఉద్యోగాల కోత‌

న్యూయార్క్‌: ప‌్రపంచంలో ప్ర‌ముఖ వ్యాపార‌ సంస్థ‌, థీమ్ పార్కులు, రిసార్ట్ వ్యాపారంలో అగ్ర‌శ్రేణి కంపెనీ డిస్నీ త‌న ఉద్యోగాల్లో కోత విధిస్తున్న‌ది. క‌రోనాతో వ్యాపారం పూర్తిగా త‌గ్గిపోవ‌డంతో థీమ్ పార్కులు, రిసార్ట్‌ల్లోని 28 వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో 67 శాతం మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నార‌ని డిస్నీ పార్క్స్ చైర్మెన్ జోష్ డీ అమారో తెలిపారు. డిస్నీ థీమ్ పార్కులు, రిసార్టుల విభాగంలో అమెరికా వ్యాప్తంగా సుమారు ల‌క్షమంది ఉద్యోగులు ఉన్నారు.  

క‌రోనా వైర‌స్ డిస్నీ వ్యాపారాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌ని అమారో వెల్ల‌డించారు. మ‌హ‌మ్మారివ‌ల్ల ఈ ఏడాది మొద‌టి మూడు నెల‌లు రిసార్టులు, థీమ్ పార్కులు మూత‌ప‌డ్డాయ‌ని చెప్పారు. దీంతో 91 శాతం లాభాలు క్షీణించాయ‌ని తెలిపారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఉద్యోగాల్లో కోత విధిస్తున్నామ‌న్నారు. మ‌హమ్మారి ఎప్పుడు అంత‌మ‌వుతుంద‌న్న అంశంలో స్ప‌ష్ట‌త లేద‌ని, దీంతో భౌతిక దూరం నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు. ఈకార‌ణంగా త‌క్కువ సంఖ్య‌లో సిబ్బందితో వ్యాపారాలు కొన‌సాగించాల్సి వ‌స్తున్న‌ద‌ని తెలిపారు. త‌మ వ్యాపార విజ‌యంలో ఉద్యోగుల పాత్ర కీల‌క‌మైనద‌ని చెప్పారు. వారి స‌హ‌కారంతోనే వినియోగ‌దారుల‌కు ప్ర‌పంచ‌స్థాయి సౌక‌ర్యాలు క‌ల్పించామ‌న్నారు.      


logo