శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 19:39:24

హోటల్‌లో బిల్లు కట్టకుండా చీప్‌ట్రిక్‌... కానీ సీసీ కెమెరాలకు చిక్కారు..! వీడియో వైరల్‌

హోటల్‌లో బిల్లు కట్టకుండా చీప్‌ట్రిక్‌... కానీ సీసీ కెమెరాలకు చిక్కారు..! వీడియో వైరల్‌

బ్లాక్‌బర్న్‌: హోటల్‌కు వెళ్లిన ఇద్దరు ఆరుగురు తినేంత భోజనం ఆర్డర్‌ చేశారు. ఇద్దరూ కడుపునిండా తిన్నారు. అనంతరం బిల్లు ఎగ్టొట్టేందుకు చీప్‌ట్రిక్‌ ప్లే చేశారు. సీసీ కెమెరాలకు చిక్కి, పరువు పోగొట్టుకున్నారు. తమ దగ్గర ఉన్న కొంతమొత్తాని చెల్లించి, హోటల్‌ యజమానిని బతిమిలాడుకొని అక్కడినుంచి బయటపడ్డారు. 

లండన్‌లోని బ్లాక్‌బర్‌లోగల బీబీక్యూ కిచెన్‌ రెస్టారెంట్‌లో జరిగింది ఈ సంఘటన.  ఇద్దరు వ్యక్తులు 67 డాలర్లు అంటే రూ. 6,477 విలువైన ఆహారాన్ని ఆర్డర్‌ చేశారు. తినడం పూర్తయిన తర్వాత అందులో ఒకరు తలపై గట్టిగా రుద్ది వెంట్రుకలు రాగానే, వాటిని ముందున్న ప్లేట్‌పై చల్లాడు. ఆహారంలో వెంట్రుకలు ఉన్నాయని, బిల్లు కట్టబోమని మొండికేశారు. కాగా, హోటల్‌ మేనేజర్‌ సీసీ కెమెరా ఫుటేజీలు చెక్‌చేయగా,వారి బండారం బయటపడింది. మరో పదినిమిషాలు వాదించి, తమ దగ్గరున్న 20 డాలర్లు ఇచ్చి అక్కడినుంచి వారు వెళ్లిపోయారు. కాగా, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తమకు సంబంధంలేదని, ఇది సివిల్‌ వివాదమని చెప్పినట్లు మేనేజర్‌ వాపోయాడు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo