శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 01, 2020 , 19:32:02

కంబోడియాలో భారత రాయబారిగా దేవయాని నియామకం

కంబోడియాలో భారత రాయబారిగా దేవయాని నియామకం

న్యూఢిల్లీ : కంబోడియాలో భారత రాయబారిగా దేవయాని ఉత్తం ఖోబ్రగడే నియమితులయ్యారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఆమె నియామకాన్ని ధ్రువీకరించింది. 1999 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌) కు చెందిన దేవయాని.. ప్రస్తుతం ఢిల్లీలోని విదేశాంగా మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. దాదాపు 21 సంవత్సరాల కెరీర్‌లో దేవయాని.. బెర్లిన్, ఇస్లామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారతీయ మిషన్లలో పనిచేశారు.

తన ఇంట్లోని భారతీయ పనిమనిషికి అండర్ పేయింగ్ ఆరోపణలపై న్యూయార్క్‌లోని అధికారులు దేవయాని ఖోబ్రగడేపై చర్య తీసుకోవడంతో 2013 లో ఆమె వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత ఆమె న్యూయార్క్‌లోని ఇండియన్‌ డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఖోబ్రగడే.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సెంట్రల్ యూరప్, ఫైనాన్స్, సీపీవీ (కాన్సులర్ పాస్‌పోర్ట్, వీసా) విభాగాలతో సహా అనేక విభాగాల్లో పనిచేశారు.


logo