శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 12:12:30

మ‌ద్యం ఎక్కువై కింద ప‌డ‌బోతున్న‌ మ‌హిళ‌ను ప‌ట్టుకున్న కుక్క‌!

మ‌ద్యం ఎక్కువై కింద ప‌డ‌బోతున్న‌ మ‌హిళ‌ను ప‌ట్టుకున్న కుక్క‌!

కుక్క‌లు ఎంత విశ్వాసంగా ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. య‌జ‌మానులు కొంచెం బాగా చూసుకుంటే చాలు వాటి ప్రాణాలు ఇవ్వ‌డానికి కూడా వెనుకాడ‌వు. అందుకే కుక్క‌లను ఎక్కువ‌మంది పెంచుకునేందుకు ఇష్ట‌ప‌డుతారు. ఈ య‌జ‌మాని కుక్క కూడా అంతే న‌మ్మ‌కంతో ఉంది. ఒక‌రోజు రాత్రి మ‌ద్యం సేవించి య‌జ‌మాని  ఇంటికి వ‌చ్చింది. మ‌ద్యం ఎక్కువ అవ‌డంతో ఊగిపోతున్న‌ది. అదుపుత‌ప్పి ప‌డిపోతున్న ఆమెను కాళ్ల‌తో ప‌ట్టుకొని బెడ్ మీద కూర్చోపెట్టింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

హ‌న్న‌న్ క్విట‌స్ అనే మ‌హిళ జాక్స్ అనే కుక్క‌ను పెంచుకుంటుంది. హన్నా తాగిన మ‌త్తులో కింద‌ప‌డ‌బోయింది. జాక్స్ చూసి ఊరుకోలేదు. య‌జ‌మానిని కాపాడుకునేందుకు కుక్క ప‌డ్డ తాప‌త్ర‌యం చూసి నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. కాళ్ల‌ను చేతులుగా ఆధారం చేసుకొని ఆమెను ప‌ట్టుకొని మంచం మీద కూర్చోపెట్టింది. ఈ వీడియో భాగ‌స్వామ్యం చేయ‌బ‌డిన‌ప్ప‌టి నుంచి క్లిప్ 3 మిలియ‌న్ల వీక్ష‌ణ‌ల‌ను సంపాదించింది.