బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 23, 2020 , 21:30:24

మెలానియాతో కలిసి భారత పర్యటనకు వెళ్తున్నా: ట్రంప్‌

మెలానియాతో కలిసి భారత పర్యటనకు వెళ్తున్నా: ట్రంప్‌

వాషింగ్టన్‌ డీసీ: తన భార్య మెలానియాతో కలిసి భారతదేశ పర్యటనకు వెళ్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొద్ది నిమిషాల క్రితం ట్వీట్‌ చేశారు. రెండు రోజుల పాటు ట్రంప్‌.. కుటుంబ సమేతంగా భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. కాగా, అమెరికా అధ్యక్షుడి విమానం.. జర్మనీ మీదుగా భారత్‌కు చేరుకోనుంది. రేపు ఉదయం 11.55 గంటలకు ట్రంప్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం, విమానాశ్రయం నుంచి మొతెరా స్టేడియం వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. రోడ్‌ షోలో భాగంగా ట్రంప్‌.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ప్రధాని మోదితో కలిసి ట్రంప్‌ మొతెరాలో నిర్మించిన స్టేడియాన్ని ప్రారంభిస్తారు. మొతెరా స్టేడియంలో నమస్తేట్రంప్‌ కార్యక్రమంలో ట్రంప్‌, మోది ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొంటారు.

అనంతరం, ట్రంప్‌ కుటుంబసమేతంగా సాయంత్రం ఆగ్రా చేరుకొని, చారిత్రక కట్టడం తాజ్‌మహాల్‌ను సందర్శిస్తారు. రాత్రికి ఢిల్లీ చేరుకొని, అక్కడ అతిథి గృహంలో బస చేస్తారు. మంగళవారం ట్రంప్‌.. భారత ప్రధాని మోదితో ఇరుదేశాలకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి ఇచ్చే ప్రత్యేక విందుకు ట్రంప్‌ హాజరవుతారు. 


logo