గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 16, 2020 , 18:37:11

ప‌న్ను పీకినందుకు డాక్ట‌ర్‌కు 12 ఏండ్లు జైలు శిక్ష‌.. ఎందుకంటే!

ప‌న్ను పీకినందుకు డాక్ట‌ర్‌కు 12 ఏండ్లు జైలు శిక్ష‌.. ఎందుకంటే!

ప‌న్ను నొప్పితో ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల కార‌ణంగా డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వ‌స్తారు. పాడైన ప‌న్నును డాక్ట‌ర్ తొలిగిస్తాడు. ఇలా చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. మ‌రి దీనికి ఆ డాక్ట‌ర్‌ను జైల్లో వేయ‌డం ఏంటి. అది కూడా 12 ఏండ్లు అనుకుంటున్నారా. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఆ డాక్ట‌ర్ చేసిన ప‌నికి శిక్ష కూడా స‌రిపోదు అంటున్నారు. ఆ డాక్ట‌ర్ ప‌న్ను పీక‌డంతోపాటు చేసిన త‌ప్పేంటో తెలిస్తే మీరు కూడా శిక్ష క‌రెక్టే అంటారు. డాక్ట‌ర్ల‌ను దేవుడితో పోలుస్తారు. ప‌న్ను నొప్పితో బాధ‌ప‌డుతూ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన పేషంట్‌ను డాక్ట‌ర్ ఫ‌న్నీగా తీసుకున్నాడు.

ట్రీట్‌మెంట్ చేస్తాన‌ని చెప్పి ప‌డుకోబెట్టాడు. పేషంట్‌కు మ‌త్తుమందు ఇచ్చి అత‌ను మాత్రం హోవ‌ర్డ్‌బోర్డు మీద నిల్చున్నాడు. అంటే ఇది చ‌క్రాల్లా అటూ ఇటూ క‌దులుతుంటుంది. వీటిని ఎక్కువ‌గా స‌ర్క‌స్‌లో ఉప‌యోగిస్తారు. దాని మీద నిల్చొని పేషంట్ ప‌న్ను పీకాడు. ఈ స‌మ‌యంలో హోవ‌ర్డ్ బోర్డు ఏ మాత్రం క‌దిలినా పేషంట్ ప్రాణాల‌కే ప్ర‌మాదం. అవేవి ప‌ట్టించుకోకుండా డాక్ట‌ర్ అత‌ని ప్రాణాల‌తో చెల‌గాట‌మాడాడు. ఆ డెంటిస్ట్ అంత‌టితో ఆగ‌లేదు. వైద్యం చేస్తూనే వీడియో తీసుకున్నాడు. తానేదో గొప్ప ప‌నిచేస్తున్న‌ట్లు పొంగిపొర్లిపొతున్నాడు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది. ఇది చూసిన కొంద‌రు డాక్ట‌ర్‌పై విరుచుకుప‌డుతూ కేసు పెట్టారు. 

డాక్ట‌ర్ ఎంత చిత్త‌శుద్దితో ప‌నిచేయాలి. కానీ ఈ డాక్ట‌ర్‌ను న‌మ్ముకొని వ‌చ్చిన పేషంట్ల‌ను ఇలా ఆడుకుంటున్నాడు. ఇత‌నికి శిక్ష‌ప‌డాలి అంటూ వాపోతున్నారు. దీన్ని పోలీసులు సీరియ‌స్‌గా తీసుకొని కోర్టుకు హాజ‌రుప‌రిచారు. ప్ర‌మాద‌క‌ర స్టంట్ల‌తో వైద్యం చేయ‌డం వంటి కేసులు న‌మోదుకావ‌డంతో అత‌నికి 12 ఏండ్లు జైలు శిక్ష విధించింది. ఈ డెంటిస్ట్ ఇలాంటివే కాదు వైద్యం చేయ‌కుండా చేశాన‌ని చెప్పి డ‌బ్బులు వ‌సూలు చేస్తుంటాడు. ఇప్పుడు వెలుగులోకి రావ‌డంతో జైలుపాల‌య్యాడు. ఈ సంఘ‌ట‌న అలస్కాలోని ఎంకరేజ్‌లో చోటు చేసుకున్న‌ది. ఈ డెంటిస్ట్ పేరు సేథ్ లోక్‌హార్ట్.


logo