శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 13:51:50

మూడుసార్లు వాయిదా..ఎట్టకేలకు వివాహం చేసుకున్న ప్రధాని

మూడుసార్లు వాయిదా..ఎట్టకేలకు వివాహం చేసుకున్న ప్రధాని

కొపెన్‌హెగన్:  డెన్మార్క్ ప్రధాని మెట్టె ప్రెడ్రిక్‌సన్(42) ఎట్టకేలకు  వివాహం చేసుకున్నారు.   ఫిల్మ్‌మేకర్‌, ఫొటోగ్రాఫర్‌  బో టెంగ్‌బర్గ్‌(55)ను  ఆమె   సంప్రదాయబద్దంగా బుధవారం  పెళ్లాడారు.  ఆగ్నేయ డెన్మార్క్‌లోని మోయెన్‌ ద్వీపంలోని మధ్యయుగకాలంనాటి మాగ్లేబీ చర్చిలో ఆమె వివాహం చేసుకున్నారని డానిష్‌ మీడియా పేర్కొంది.  పెళ్లి అనంతరం చర్చి నుంచి బయటకు సంతోషంతో వస్తున్న  నూతన వధూవరుల ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేస్తూ 'జా' అని ట్వీట్‌ చేసింది.   

రహస్యంగా చేసుకున్న వివాహానికి మాజీ డెన్మార్క్‌ ప్రధాని పౌల్‌ నైరూప్‌తో సహా కొద్దిమంది  కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా మహమ్మారి, తదితర కారణాల  వల్ల  ప్రధాని మెట్టె  తన పెళ్లిని మూడుసార్లు వాయిదా వేసుకున్నారు.  దేశ ప్రజలు, ప్రయోజనాల కోసం నేను నా వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నానని జూన్‌లో సోషల్‌మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. 

View this post on Instagram

JA❤️

A post shared by Mette Frederiksen (@mette) on


logo