ఆదివారం 17 జనవరి 2021
International - Jan 08, 2021 , 16:49:19

సున్నా శాతం వ‌డ్డీకే హోమ్‌లోన్‌

సున్నా శాతం వ‌డ్డీకే హోమ్‌లోన్‌

కోపెన్‌హాగెన్‌: ఇది చ‌ద‌వ‌గానే వెంట‌నే ఒక ఇల్లు కొనేయాల‌ని అనిపిస్తోందా! అయితే వెంట‌నే డెన్మార్క్ వెళ్లాల్సిందే. ఎందుకంటే హోమ్‌లోన్‌పై సున్నా శాతం వ‌డ్డీ ఉన్న‌ది ఆ దేశంలోనే మ‌రి. ఆ దేశంలోని బ్యాంకులు 20 ఏళ్ల ఇంటి రుణాన్ని ఎలాంటి వ‌డ్డీ లేకుండానే ఇచ్చేస్తున్నాయి. ప్ర‌పంచంలో సున్నా కాదు క‌దా.. మైన‌స్‌లో వ‌డ్డీ రేట్లు ఉన్న ఏకైక దేశం డెన్మార్కే. ప్ర‌పంచంలో మ‌రే దేశం ఇవ్వ‌నంత కాలం ఇవే రేట్ల‌ను డెన్మార్క్ కొన‌సాగించింది. 2012లో తొలిసారి అక్క‌డి ప్ర‌భుత్వం వ‌డ్డీ రేట్ల‌ను సున్నా కంటే త‌క్కువకు త‌గ్గించిన‌ప్పుడు డెన్మార్క్‌లో సొంత ఇల్లు కొన్న వాళ్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. 

అస‌లు ఏమాత్రం వ‌డ్డీ లేకుండా 20 ఏళ్ల‌కు ఇంటిపై రుణం ఇవ్వ‌డం అంటే న‌మ్మ‌శ‌క్యం కానిదే. ఇప్పుడు డెన్మార్క్‌లోని నార్డియా బ్యాంక్ ఏబీపీ సున్నా వ‌డ్డీకే హోమ్‌లోన్ ఇస్తోంది. దీనికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న రావ‌డంతో ఇత‌ర బ్యాంకులు కూడా నార్డియా బ్యాంక్ రూట్‌లోనే వెళ్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోనే చాలా బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను పెంచ‌కుండా అలాగే ఉంచుతున్నాయి. 2021లోనూ ఇదే ట్రెండ్ కొన‌సాగుతుంద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ స్ప‌ష్టం చేసింది.