మంగళవారం 19 జనవరి 2021
International - Jan 12, 2021 , 01:36:01

ట్రంప్‌ అభిశంసనకు రంగం సిద్ధం

ట్రంప్‌ అభిశంసనకు రంగం సిద్ధం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ను గద్దెదించేందుకు డెమోక్రటిక్‌ పార్టీ సోమవారం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. గతవారం క్యాపిటల్‌ భవనంపై హింసాత్మక దాడికి తన అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఆయనను పదవి నుంచి తొలిగించేందుకు సిద్ధమైంది. డెమోక్రాట్ల ఆధిపత్యమున్న ప్రతినిధుల సభలో బుధవారం ఈ తీర్మానం చర్చకు రానున్నది. రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షుడిగా ట్రంప్‌ అపప్రథ మూటగట్టుకోనున్నారు. అధ్యక్షుడిని తొలిగించేందుకు ఆర్టికల్‌ 20 ప్రయోగించడంపై మంగళవారం సభలో ఓటింగ్‌ జరుగనున్నది. క్యాపిటల్‌ భవనంపై దాడి ఘటన తనకు అసంతృప్తిని, ఆవేదనను కలిగించిందని ట్రంప్‌ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా పేర్కొన్నారు. 

క్యాపిటల్‌పై దాడి..నాజీల దాడి వంటిదే!

డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక విఫల నాయకుడు. అమెరికా చరిత్రలో అతిచెత్త అధ్యక్షుడిగా నిలిచిపోతారు. క్యాపిటల్‌ భవనంపై దాడికి పాల్పడిన మూకలు హిట్లర్‌ నాజీ మూకల లాంటివే. 

-ఆర్నాల్డ్‌ స్కార్జ్‌నెగ్గర్‌, కాలిఫోర్నియా మాజీ గవర్నర్‌