శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 06:12:54

సెనేట్‌లో ట్రంప్‌కు చుక్కెదురు

సెనేట్‌లో ట్రంప్‌కు చుక్కెదురు

కరోనా నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు ప్రతిపాదించిన ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి సెనేట్‌లో చుక్కెదురైంది. డెమోక్రాట్ల నుంచి దీనికి మద్దతు లభించలేదు. అలాగే అధికార రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు క్వారంటైన్‌లో ఉండడం వల్ల ఓటింగ్‌లో పాల్గొనలేదు. ప్రస్తుత సంక్షోభం సమయంలో లక్షలాది మంది ప్రజలను రక్షించడంలో, వైద్యారోగ్య వ్యవస్థను మెరుగుపరచడంలో రిపబ్లికన్ల ప్రణాళిక విఫలమైందని డెమొక్రాట్లు విమర్శించారు.  దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమక్రట్లు తమ రాజకీయ ఎజెండా అమలు చేయడానికి ఇది సమయం కాదని విజ్ఞప్తి చేశారు. తమ రాజకీయ ఎజెండా అమలులో భాగంగా డెమోక్రట్లు సెనెట్‌లో చేసిన వాదనలు సరైనవి కావని కరోనా వైరస్‌ మహమ్మారిని ఉపయోగించుకునేందుకు చూస్తున్నారని వాధించారు. 


logo