మొరాకో : మధ్యప్రాశ్చ్య దేశాలు ( Middle East ) ఫోర్త్ వేవ్ ( Fourth Wave ) మొదలైంది. ఆ దేశాల్లో డెల్టా వేరియంట్ ( Delta Variant ) కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) చెప్పింది. మిడిల్ఈస్ట్ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. మధ్యప్రాశ్చ్యంలో ఉన్న 22 దేశాల్లో ఇప్పటికే డెల్టా వేరియంట్ 15 దేశాల్లో నమోదు అయినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొరాకో నుంచి పాకిస్థాన్ వరకు డెల్టా కేసులు రికార్డు అవుతున్నాయి. మధ్యధర ప్రాంతం తూర్పున డెల్టా వల్ల మరణాల సంఖ్య కూడా పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో ఓ ప్రకటనలో వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకోని వారిలోనే కొత్తగా కేసులు వస్తున్నాయి. వారంతా హాస్పిటల్ పాలవుతున్నట్లు తెలుస్తోంది. మిడిల్ఈస్ట్లో కోవిడ్ ఫోర్త్‌వేవ్ కొనసాగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ అహ్మద్ అల్ మందారి తెలిపారు. మధ్యప్రాశ్చ్య దేశాల్లోని కేవలం నాలుగు కోట్ల మంది మాత్రమే వ్యాక్సినేట్ అయ్యారు. కానీ ఇన్ఫెక్షన్లు 55 శాతం పెరిగాయి. 15 శాతం డెత్ రేటు కూడా పెరిగినట్లు చెబుతున్నారు.