శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 15:13:01

ఫుడ్‌డెలివరీ బాయ్స్‌గా బాడీబిల్డర్స్‌.. కొవిడ్‌ నేర్పిన వ్యాపారం..!

ఫుడ్‌డెలివరీ బాయ్స్‌గా బాడీబిల్డర్స్‌.. కొవిడ్‌ నేర్పిన వ్యాపారం..!

టోక్యో: కొవిడ్‌ -19వల్ల వ్యాపార,వాణిజ్య సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇక హోటళ్ల విషయానికొస్తే తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో యజమానులు ఏంచేయాలో పాలుపోక తలలుపట్టుకుంటున్నారు. అయితే, జపాన్‌లోని ఓ రెస్టారెంట్‌ యజమాని వినూత్నంగా ఆలోచించి, తన వ్యాపారాన్ని తిరిగి గాడినపెట్టుకున్నాడు. బాడీ బిల్డర్స్‌తో ఫుడ్‌ డెలివరీ చేయిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాడు. 

ప్రపంచవ్యాప్తంగా అన్ని హోటళ్లలానే జపాన్‌లోని  సుషీ రెస్టారెంట్ మూతపడింది. యజమాని నష్టాల్లో కూరుకుపోయాడు. అయితే, అతడికి వచ్చిన ఒక ఐడియా మళ్లీ తన వ్యాపారం పుంజుకునేలా చేసింది. బాడీబిల్డర్‌ అయిన ఆ యజమాని ఫుడ్‌ డెలవరీకి మరింత మంది బాడీ బిల్డర్లను పనిలో పెట్టుకున్నాడు. ఫుడ్‌ ఆర్డర్‌రాగానే ఈ బాడీబిల్డర్లు సూట్‌ ధరించి ఆహారం తీసుకెళ్తారు. వినియోగదారుడికి ఫుడ్‌ ఇచ్చి, వెంటనే సూట్‌ విప్పి దేహదారుఢ్య ప్రదర్శన చేస్తారు. దీనిని ‘డెలివరీ మచ్చో’ సర్వీస్‌ అని పిలుస్తున్నారు. 7,000 యెన్ (ఇది భారతదేశంలో రూ .4825)ల గరిష్ట ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తున్నాడు. కొత్తగా ఉండడంతో రోజుకు పది మంది వినియోగదారులు ఫుడ్‌ ఆర్డర్‌ ఇస్తున్నారట. ఇలా నెలకు సుమారు 1.5 మిలియన్ యెన్స్‌ అంటే రూ. పదిలక్షలకుపైగానే సంపాదిస్తున్నాడు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo