శనివారం 28 నవంబర్ 2020
International - Nov 05, 2020 , 17:01:40

ఫుడ్ డెలివ‌రీ చేసి..ఎత్తుకెళ్లింది..వీడియో వైర‌ల్

ఫుడ్ డెలివ‌రీ చేసి..ఎత్తుకెళ్లింది..వీడియో వైర‌ల్

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మార్పులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అత్య‌వ‌స‌ర సేవ‌లందించే వ్య‌క్తులైతే త‌ప్ప వేరే వ్య‌క్తులు ఖ‌చ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. లాక్ డౌన్ తో చాలా రోజులు ఆన్ లైన్ ఫుడ్ డెలివ‌రీ స‌ర్వీసులు నిలిచిపోయాయి. కేసులు త‌గ్గిన త‌ర్వాత మెల్ల‌గా ఫుడ్ డెలివ‌రీ సేవ‌లు ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని దేశాల్లో క‌స్ట‌మ‌ర్ల‌తో కాంటాక్ట్ అవ‌కుండా ఫుడ్ డెలివ‌రీ చేసే ప‌ద్ద‌తిని పాటిస్తున్నాయి సంస్థ‌లు.

ఫుడ్ డెలివ‌రీ బాయ్ కానీ గ‌ర్ల్ కానీ క‌స్ట‌మ‌ర్ ఇంటి ద‌గ్గ‌ర‌కు ఆహారం తీసుకెళ్లి..డోర్ ద‌గ్గ‌ర ఫుడ్ ప్యాక్ పెట్టి ఆ ఫొటోను తీసి..డెలివ‌రి పూర్త‌యింద‌ని తెలిపేందుకు ప్రూఫ్ గా చూపించాలి. యూఎస్ లో ఓ వ్య‌క్తి డోర్‌డాష్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివ‌రీ గ‌ర్ల్ క‌స్ట‌మ‌ర్ ఇంటి తలుపు ద‌గ్గ‌ర ఫుడ్ బ్యాగ్ పెట్టి దాన్ని ఫొటో తీసింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా..? స‌ద‌రు డెలివ‌రీ గ‌ర్ల్ చాలా తెలివిగా ఫుడ్ బ్యాగ్ అక్క‌డ డెలివ‌రీ చేసిన‌ట్టే చేసి మ‌ళ్లీ త‌న వెంట తీసుకెళ్లింది. ఈ దృశ్య‌మంతా అక్క‌డే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.


బార్బీడ్ పేరుతో ఉ్న టిక్ టాక్ యూజ‌ర్ త‌న అకౌంట్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయ‌గా నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. మీరు కెమెరాలు లేవ‌నుకున్నారా..? డోర్ డాష్ మిమ్మ‌ల్ని కాల్చేస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.