బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 10, 2020 , 03:41:57

అడవులు నరికేస్తే మలేరియా ముప్పు!

అడవులు నరికేస్తే మలేరియా ముప్పు!

మెల్‌బోర్న్‌: కాఫీ, పొగాకు ఉత్పత్తి కోసం అడవుల నరికివేతతో మలేరియా ముప్పు పొంచి ఉందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ జరిపిన సర్వేలో తేలింది. కాఫీ, కలప, కొకైన్‌, పామాయిల్‌, పొగాకు తదితర అంతర్జాతీయ ఎగుమతుల కోసం ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికి వేతత్లో 20% మలేరియా ముప్పు పొంచి ఉన్నదని ఈ సర్వే పేర్కొన్నది. దీనిపై వర్సిటీ ప్రొఫెసర్‌ మాన్‌ఫ్రెడ్‌ లెన్‌జెన్‌ మాట్లాడుతూ అడవుల నరికివేతతో సంబంధం ఉన్న వస్తువుల కొనుగోళ్లు చేయొద్దన్నారు. అడవుల నరికివేతతో సగటు ఉష్ణోగ్రతలు పెరిగి దోమలు నివసించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, అందువల్ల మలేరియా ముప్పు పొంచి ఉందని ఇంతకుముందు సర్వేల్లోనూ వెల్లడైంది. అడవుల నరికివేతతో లభించే వస్తువులు, ఇతర వనరుల వినియోగానికి దూరంగా ఉంటే జీవ వైవిధ్య నష్టాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందని పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు. 
logo