శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 11:56:34

ఇరాన్ ర‌క్ష‌ణ మంత్రితో రాజ్‌నాథ్ భేటీ

ఇరాన్ ర‌క్ష‌ణ మంత్రితో రాజ్‌నాథ్ భేటీ

టెహ్రాన్ : ఇరాన్ ర‌క్ష‌ణ శాఖ‌ మంత్రి బ్రిగేడియ‌ర్ జ‌న‌ర‌ల్ అమీర్ హ‌తామితో భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ టెహ్రాన్‌లో ఆదివారం స‌మావేశ‌మ‌య్యారు. భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు, ద్వైపాక్షిక స‌హ‌కారంపై ఇరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌మావేశం ముగిసిన అనంత‌రం రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్ ర‌క్ష‌ణ మంత్రి హ‌తామితో ఫ‌ల‌వంత‌మైన చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌తో స‌హా ప్రాంతీయ భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు, ద్వైపాక్షిక స‌హ‌కారంపై చ‌ర్చ జ‌రిగింద‌ని రాజ్‌నాథ్ తెలిపారు.  

షాంఘై సహకార సమాఖ్య సమావేశాల్లో పాల్గొన్న రాజ్‌నాథ్‌ సింగ్ శ‌నివారం‌ బిజీబిజీగా గడిపారు. ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, తజకిస్థాన్‌ రక్షణ మంత్రులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఉజ్బెక్‌ రక్షణమంత్రి కుర్బనోవ్‌ బఖోదిర్‌ నిజమోవిచ్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందని ట్వీట్‌ చేశారు. రష్యాలో మూడురోజుల పర్యటన ముగించుకున్న అనంత‌రం శ‌నివారం రాత్రి ఇరాన్ ప‌ర్య‌ట‌న‌కు రాజ్‌నాథ్ వెళ్లారు.


logo