శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 14:42:54

రష్యా సైనిక దళాల ప్రధాన కేథడ్రల్‌ను సందర్శించిన రాజ్‌నాథ్

రష్యా సైనిక దళాల ప్రధాన కేథడ్రల్‌ను సందర్శించిన రాజ్‌నాథ్

మాస్కో: రష్యా పర్యటనలో ఉన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం రష్యన్ ఫెడరేషన్ సాయుధ దళాల ప్రధాన కేథడ్రల్, మాస్కోలోని మ్యూజియం కాంప్లెక్స్‌ను సందర్శించారు. రష్యా సమరయోధుల స్మారకం వద్ద పుష్పాలతో నివాళి అర్పించారు. రాజ్‌నాథ్ మూడు రోజుల రష్యా పర్యటన కోసం బుధవారం మాస్కో చేరారు. ఇక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా రష్యా, చైనా రక్షణ మంత్రులతో రాజనాథ్ కీలక చర్చలు జరుపుతారని సమాచారం. లడఖ్ సరిహద్దులో భారత్, చైనా సైన్యం మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకోనున్నది.

ఐరోపా, ఆసియా దేశాల రాజకీయ, ఆర్థిక, భద్రత కూటమి అయిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎసీవో)‌ని 2001 జూన్ 15న చైనాలోని షాంఘై‌లో ప్రకటించారు. చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ వ్యవస్థాపక సభ్య దేశాలుగా 2003 సెప్టెంబర్ 19న ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. 2017 జూన్ 9న భారత్, పాకిస్థాన్ కూడా సభ్య దేశాలుగా ఇందులో చేరాయి. దీంతో ఎస్‌సీవో కూటమి సభ్య దేశాల సంఖ్య ఎనిమిదికి చేరింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo