మంగళవారం 31 మార్చి 2020
International - Feb 06, 2020 , 00:35:08

చైనాలో తగ్గుతున్న కరోనా కేసులు

చైనాలో తగ్గుతున్న కరోనా కేసులు

బీజింగ్‌: చైనాతోపాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి ‘కరోనా’ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గత రెండు రోజులతో పోలిస్తే మంగళవారం కొత్తగా నమోదైన ‘కరోనా’ కేసులు తక్కువగా ఉన్నాయని చైనా తెలిపింది. మంగళవారం 3971 నూతన కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. ఆదివారం 5,173 కేసులు, సోమవారం 5,072 నూతన కేసులు నమోదయ్యాయి. వుహాన్‌లో మరిన్ని ప్రత్యేక దవాఖానలను ఏర్పాటు చేయడంతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చైనా అధికారులు తెలిపారు. మరోవైపు మంగళవారంకల్లా ‘కరోనా’ వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 491 మందికి చేరుకున్నది. వ్యాధి సోకిన వారి సంఖ్య 24,324 మందికి చేరింది. వివిధ దేశాల్లో కరోనా వ్యాధి కేసులు 182కి పెరిగాయి. ఫిలిప్పైన్స్‌లో తొలి మరణం నమోదైంది. 


logo
>>>>>>