గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 01, 2020 , 02:00:02

27కు చేరిన భూకంప మృతులు

27కు చేరిన భూకంప మృతులు

ఇజ్మిర్‌ (టర్కీ): టర్కీ, గ్రీస్‌ దేశాల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 27కు పెరిగింది. శుక్రవారం టర్కీ తీరప్రాంతం, గ్రీస్‌ దీవి సమోస్‌ మధ్య ఏజియన్‌ సముద్రంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రికి 14 మృతదేహాలను వెలికితీసిన అధికారులు.. శనివారం మరో 13 మృతదేహాలను గుర్తించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 27కు చేరింది.