సోమవారం 30 మార్చి 2020
International - Jan 24, 2020 , 13:31:02

క‌రోనా వైర‌స్‌.. 26 మంది మృతి

క‌రోనా వైర‌స్‌.. 26 మంది మృతి

హైద‌రాబాద్‌:  చైనాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 26కు చేరుకున్న‌ది.  హుబ‌యి ప్రావిన్సు మొత్తం ఆంక్ష‌లు విధించారు. ఆ రాష్ట్రంలో ఉన్న సుమారు ప‌ది న‌గ‌రాల్లో ట్రావెల్ బ్యాన్ విధించారు. దేశ‌వ్యాప్తంగా 830 క‌రోనా కేసుల‌ను అధికారులు ద్రువీక‌రించారు. చైనా నూత‌న సంవ‌త్స‌రం స‌మీపిస్తున్న త‌రుణంలో వైర‌స్ ప్ర‌బ‌లుతున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  దీంతో షాంఘైలోని డిస్నీ రిసార్ట్‌ను మూసివేశారు. అనేక ఉత్స‌వాల‌ను ర‌ద్దు చేశారు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ .. చైనాలోని అన్ని ప్రాంతాల‌కు వ్యాప్తి చెందింది. జ‌పాన్‌, థాయిలాండ్‌, అమెరికా దేశాల్లోనూ క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.  మృతుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో.. చైనాలో ట్రావెల్ ఆంక్ష‌లు కూడా పెరుగుతున్నాయి.


 


logo