ఆదివారం 31 మే 2020
International - Apr 17, 2020 , 14:18:09

క‌రోనా మృతుల సంఖ్యను 50 శాతం పెంచిన వుహాన్‌..

క‌రోనా మృతుల సంఖ్యను 50 శాతం పెంచిన వుహాన్‌..

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ మృతుల సంఖ్యను వుహాన్ న‌గ‌రం రెట్టింపు చేసింది.  ముందు వెల్ల‌డించిన దాని క‌న్నా.. 50 శాతం ఎక్కువ మ‌ర‌ణాలు న‌మోదు అయిన‌ట్లు ఆ న‌గ‌రం పేర్కొన్న‌ది. ఏప్రిల్ 16వ తేదీ వ‌ర‌కు ఆ న‌గ‌రంలో 50,333 కేసులు పాజిటివ్‌గా తేలియాయి. ఇక‌ మ‌ర‌ణించిన వారి సంఖ్య‌లో అద‌నంగా 1290 మందిని జోడించారు. నిన్న‌టి వ‌ర‌కు వుహాన్‌లో మ‌ర‌ణించిన వారి సంఖ్య 2579గా ఉన్నది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల మ‌ర‌ణాల లెక్కింపు జ‌ర‌గలేద‌ని, ఆ త‌ప్పుల‌ను స‌వ‌రిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. తాజా స‌మాచారం ప్ర‌కారం వుహాన్‌లో 3879 మంది ప్రాణాలు కోల్పోయారు. వుహాన్ సంఖ్య పెర‌గ‌డంతో దేశ‌వ్యాప్తంగా మ‌ర‌ణాల సంఖ్య 39 శాతం పెరిగింది.  దీంతో ఇప్పుడు చైనాలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయిన‌వారి సంఖ్య 4632గా నిలిచింది. logo