సోమవారం 30 మార్చి 2020
International - Feb 19, 2020 , 00:51:04

14 మంది ఊపిరితీసిన విషవాయువు

14 మంది ఊపిరితీసిన విషవాయువు
  • పాకిస్థాన్‌లో ఘటన

కరాచీ: పాకిస్థాన్‌లో అంతుచిక్కని విషవాయువు లీకేజీ వల్ల 14 మంది మరణించారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి కరాచీలోని కేమరి ప్రాంతంలో విషవాయువును పీల్చిన ప్రజలు ఊపిరి ఆడకపోవడంతో సమీప దవాఖానాలకు పరుగు తీశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో వెంటనే దవాఖానాలకు వెళ్లి పరిశీలించగా.. 14 మంది మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. మరోవైపు పౌరుల మరణానికి అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ పలువురు ఆందోళనకు దిగారు. పోలీసులు మాట్లాడుతూ ఇది ఏ విషవాయువు.. ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదని చెప్పారు. ఇంకోవైపు అధికారులు స్పందిస్తూ ఓ నౌక నుంచి సోయాబిన్‌ లేదా ఆ కోవకు చెందిన వస్తువులను దించుతున్నప్పుడు ఈ విషవాయువు వెలువడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.


logo