సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 17:18:08

ఆస్ట్రేలియాలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆస్ట్రేలియాలో పెరుగుతున్న కరోనా కేసులు

మెల్ బోర్న్ : ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 1,28,96,895 మంది రోగులు నయమయ్యారు. 7,33,918 మంది మరణించారు. ఆస్ట్రేలియాలో గత 24 గంటల్లో 323 కొత్త కేసులు రావడంతో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 21,407 కు పెరిగింది. ఇప్పటివరకు 11,876 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో దేశంలో వైరస్ వ్యాప్తి ఊపందుకున్న తరువాత అనేక రాష్ట్రాల మధ్య సరిహద్దులను మూసివేశారు. డిసెంబర్ నెలకు ముందు దేశ సరిహద్దులను తెరువమని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ స్పష్టం చేశారు

లాక్డౌన్ నిబంధనలను విమర్శించిన బ్రెజిల్ అధ్యక్షుడు

బ్రెజిల్ లో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య లక్ష దాటిన తర్వాత లాక్డౌన్ నిబంధనలను అమలుచేయడాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో విమర్శించారు. లాక్డౌన్ సమయంలో దవాఖానలకు చేరక మార్చి 23-మే 1 మధ్య 16,000 మంది మరణించారని, దేశంలో అతిపెద్ద టీవీ ఛానల్ ప్రజలలో భయాన్ని వ్యాపింపజేస్తోందని ట్విట్టర్ లో ఆయన ఆరోపించారు.

జపాన్ లో 1492 కేసులు నమోదు

ఆదివారం జపాన్‌లో 1,492 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 48,702 కు పెరిగింది. దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం మేరకు.. జపాన్ రాజధాని టోక్యో నుంచి కొత్తగా 331 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,060 కి చేరుకుంది. అయితే, దేశంలో మళ్లీ అత్యవసర పరిస్థితిని పెట్టబోమని ప్రధాని షింజో అబే చెప్పారు.

బ్రిటన్ లో రెండు నెలల తర్వాత పెరిగిన సంఖ్య

జూన్ తరువాత మొదటిసారిగా గత 24 గంటల్లో వేయికి పైగా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో ఒక రోజు ముందు 758 కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించింది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్లలో హోటళ్ళు, పబ్బులు, రెస్టారెంట్లను తెరవడానికి ప్రభుత్వం జూలైలోనే అనుమతించింది.


logo