మంగళవారం 19 జనవరి 2021
International - Dec 26, 2020 , 16:06:10

ఇథియోపియా సాయుధ దాడి.. 207కు చేరిన మ‌ర‌ణాలు

ఇథియోపియా సాయుధ దాడి.. 207కు చేరిన మ‌ర‌ణాలు

అడీస్ అబాబా: ఇథియోపియాలోని బెనిషాంగుల్ గుముజ్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం జ‌రిగిన సాయుధ దాడిలో మృతుల సంఖ్య 207కు చేరింది. ఇథియోపియా మాన‌వ హ‌క్కుల సంఘం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. మృతుల్లో 133 మంది 18 నుంచి 60 మ‌ధ్య వ‌య‌సుగ‌ల పురుషులు, 35 మంది 18 నుంచి 60 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సుగ‌ల స్త్రీలు, 20 మంది 60 ఏండ్ల పైబ‌డిన వృద్ధులు, 17 మంది 18 ఏండ్ల కంటే త‌క్కువ వ‌య‌సుగ‌ల చిన్నారులు ఉన్న‌ట్లు మాన‌వ‌హ‌క్కుల సంఘం తెలిపింది.

ఈ సాయుధ దాడి నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌వారు, మృతదేహాల‌ ద‌గ్గ‌ర ఉన్న ఐడెంటిటీ కార్డుల సాయంతో మృతుల వివ‌రాల‌ను గుర్తిస్తున్నారు. రెండు రోజుల క్రితం బెనిషాంగుల్ గుముజ్ ప్రాంతంలో నిద్రిస్తున్న జ‌నంపై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపారు. వారి ఇండ్ల‌ను త‌గుల‌బెట్టారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.