మంగళవారం 31 మార్చి 2020
International - Jan 25, 2020 , 08:52:51

క‌రోనా వైర‌స్ మృతులు 41.. హాస్పిట‌ల్‌ నిర్మిస్తున్న చైనా

క‌రోనా వైర‌స్ మృతులు 41.. హాస్పిట‌ల్‌ నిర్మిస్తున్న చైనా

హైద‌రాబాద్‌:  చైనాలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 41కి చేరుకున్న‌ది.  తాజాగా హుబివ్ ప్రావిన్సులో మ‌రో 15 మంది మృతిచెందారు.  క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్లు తొలుత గుర్తించింది ఇక్క‌డే.  ప్ర‌స్తుతం చైనా వ్యాప్తంగా సుమారు 1287 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయి. వాస్త‌వానికి ఇవాళ చైనా ప్ర‌జ‌లు కొత్త సంవ‌త్స‌ర సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. ప్ర‌స్తుతం యూరోప్‌కు కూడా వైర‌స్ పాకింది.  ఫ్రాన్స్‌లో కొత్త‌గా మూడు కేసులు న‌మోదు అయ్యాయి.  మ‌రోవైపు వైర‌స్ బాధితుల‌ను ర‌క్షించేందుకు చైనా ఓ భారీ హాస్ప‌ట‌ల్ నిర్మాణానికి పూనుకున్న‌ది.  సుమారు వెయ్యి ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని నిర్మిస్తున్న‌ది.  దీన్ని ఆరు రోజుల్లోనే నిర్మించ‌నున్నారు.  నిర్మాణ స్థ‌లం వ‌ద్ద 35 డిగ్గ‌ర్‌లు, ప‌ది బుల్డోజ‌ర్లు పనిచేస్తున్నాయి.  


logo
>>>>>>