బుధవారం 27 మే 2020
International - Apr 03, 2020 , 10:27:50

50వేలు దాటిన క‌రోనా మృతుల సంఖ్య‌

50వేలు దాటిన  క‌రోనా మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 50 వేలు దాటింది. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ ఈ విష‌యాన్ని చెప్పింది.  కోవిడ్‌19 వ‌ల్ల 50,230 మంది మృతిచెందిన‌ట్లు రీస‌ర్చ్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది.  గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో తొలిసారి వుహాన్‌లో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌రోవైపు వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య ప‌ది ల‌క్ష‌లు దాటిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.  నోవెల్ క‌రోనా వ‌ల్ల అత్య‌ధికంగా ఇట‌లీ న‌ష్ట‌పోయింది. ఆ దేశంలో సుమారు 13,915 మంది మ‌ర‌ణించారు.  స్పెయిన్‌లో సుమారు 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు.  మూడ‌వ స్థానంలో అమెరికా ఉన్న‌ది. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5316 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.


logo