శనివారం 30 మే 2020
International - Apr 06, 2020 , 19:48:39

క‌రోనా వైర‌స్‌.. 70వేలు దాటిన మృతుల సంఖ్య‌

క‌రోనా వైర‌స్‌.. 70వేలు దాటిన మృతుల సంఖ్య‌


హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా 70 వేల మంది మ‌ర‌ణించారు.  ఈ విష‌యాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది.  కోవిడ్‌19 బాధితుల డేటాబేస్‌ను ఆ వ‌ర్సిటీ మెయిన్‌టేన్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  సుమారు 50215 మంది కేవ‌లం యూరోప్‌లోనే మ‌ర‌ణించారు.  అత్య‌ధికంగా ఇట‌లీలో 15,877 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఆ త‌ర్వాత స్థానంలో స్పెయిన్ ఉన్న‌ది.  స్పెయిన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 13,055 మంది చ‌నిపోయారు.  అమెరికాలో మ‌ర‌ణించిన వారి సంఖ్య ప‌దివేల‌కు చేరుకున్న‌ది.  ఫ్రాన్స్‌లో 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య దాదాపు 13 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది. 


logo