బుధవారం 27 జనవరి 2021
International - Jan 14, 2021 , 01:24:30

70 ఏండ్లలో తొలిసారిగా మహిళకు మరణశిక్ష

70 ఏండ్లలో తొలిసారిగా మహిళకు మరణశిక్ష

వాషింగ్టన్‌: ఏడు దశాబ్దాల తర్వాత అమెరికాలో ఓ మహిళా ఖైదీకి  మరణ శిక్షను అమలు చేశారు. లీసా మోంటోగోమరీ (52) అనే మహిళా ఖైదీకి బుధవారం వేకువజామున విషపు ఇంజెక్షన్‌ ఇచ్చి ఇండియానాలోని టెర్రె హౌట్‌ ఫెడరల్‌ జైలు అధికారులు ఈ శిక్షను అమలు చేశారు. 2004లో ముస్సోరీ పట్టణానికి చెందిన 23 ఏండ్ల బాబీ జో అనే గర్భిణిని లీసా తాడుతో గొంతు బిగించి హత్య చేసింది. ఆ తర్వాత ఓ కత్తితో ఆమె కడుపును చీల్చి గర్భంలోని ఆడ బిడ్డను ఎత్తుకెళ్లింది. నేరం రుజువుకావడంతో లీసాకు మరణ శిక్ష పడింది. 


logo