మంగళవారం 07 జూలై 2020
International - Jun 05, 2020 , 11:55:08

వైర‌స్ బాధితుల‌కు అధిక‌ర‌క్త‌పోటు ఉంటే.. మ‌ర‌ణాలు ఎక్కువే

వైర‌స్ బాధితుల‌కు అధిక‌ర‌క్త‌పోటు ఉంటే.. మ‌ర‌ణాలు ఎక్కువే

హైద‌రాబాద్‌: అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారికి క‌రోనా వైర‌స్ సోకితే.. వారిలో మ‌ర‌ణాల రేటు మిగితావారితో పోలిస్తే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చైనా ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. హాస్పిట‌ళ్ల‌లో చేరిన వారిపై చేసిన స్ట‌డీ ఆధారంగా వారు ఈ విష‌యాన్ని చెప్పారు.  అధిక ర‌క్త‌పోటు ఉన్న వారు వైర‌స్ వ‌ల్ల మందులు వేసుకోవ‌డం ఆపేస్తే, వారిలో మ‌ర‌ణాల సంఖ్య పెరిగిన‌ట్లు ఆ ప‌రిశోధ‌కులు యురోపియ‌న్ హార్ట్ జ‌ర్న‌ల్‌లో రాశారు. కోవిడ్‌19 వ‌ల్ల బీపీ ఎక్కువ‌గా ఉన్న‌వారికి ప్రాణ‌హాని అధికంగా ఉంటుంద‌ని చైనాలోని జీజింగ్ హాస్ప‌త్రి కార్డియోల‌జిస్ట్ ఫే లీ తెలిపారు. ఈ స్ట‌డీ నిర్వ‌హించేందుకు ప‌రిశోధ‌కులు.. వుహాన్‌లోని హువ‌షెన్‌షాన్ హాస్పిట‌ల్‌లో చేరిన క‌రోనా పేషెంట్ల‌ను ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వ‌ర‌కు అధ్య‌య‌నం చేశారు.  

ఆ హాస్పిట‌ల్‌లో ఉన్న 850 పేషెంట్ల‌లో 30 శాతం మందికి హైప‌ర్‌టెన్ష‌న్ లేదా అధిక ర‌క్త‌పోటు ఉన్న‌ట్లు గుర్తించారు.  అయితే దాంట్లో నాలుగు శాతం మంది రోగులు క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు. బీపీ లేని 2027 మంది రోగుల్లో కేవ‌లం ఒక్క శాతం మాత్ర‌మే మ‌ర‌ణించిన‌ట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు. వ‌య‌సు, ఆడ లేదా మ‌గ, మందులు వాడుతున్నారా లేదా అన్న స్ట‌డీ చేసిన త‌ర్వాత‌.. అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారిలో మ‌ర‌ణాల రేటు రెట్టింపుగా ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు అంచ‌నాకు వ‌చ్చారు. 

చైనాలోని ఇదే హాస్పిట‌ల్‌లో మ‌రో మూడు బృందాలు కూడా క‌రోనా రోగుల‌ను స్ట‌డీ చేశాయి.  సుమారు 2300 మందిని అధ్య‌య‌నం చేసిన ఆ బృందాలు. వేరువేరు ర‌కాల‌ బీపీ మాత్ర‌లు వేసుకునే వారిలో మ‌ర‌ణాల రేటు ఎలా ఉందో కూడా స్ట‌డీ చేశాయి. యాంజియోటెన్సిన్ ఎంజైమ్ ఇన్‌హిబిట‌ర్స్ మందులు వాడిన వారిలో కోవిడ్ మ‌ర‌ణాలు రేటు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అయితే హైప‌ర్ టెన్ష‌న్ చికిత్స‌లో భాగంగా మందులు వాడుతున్న‌వారు .. కోవిడ్ వ‌ల్ల వాటిని విస్మ‌రించ‌కూడ‌ద‌ని జీజింగ్ హాస్పిట‌ల్ ప్రొఫెస‌ర్ లియాంగ్ టావో తెలిపారు. తాము చేసింది కేవ‌లం అబ్జ‌ర్వేష‌న్ స్ట‌డీ మాత్ర‌మే అని, ఇంకా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేయాల్సి ఉన్న‌ద‌ని, ఆ త‌ర్వాతే పూర్తి స్థాయి ప్ర‌తిపాద‌న‌లు వీల‌వుతాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. logo