శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 06, 2020 , 16:14:46

నాలుగో రోజూ స్పెయిన్‌లో త‌గ్గిన మ‌ర‌ణాల సంఖ్య‌

నాలుగో రోజూ స్పెయిన్‌లో త‌గ్గిన మ‌ర‌ణాల సంఖ్య‌

హైద‌రాబాద్‌: స్పెయిన్‌లో వ‌రుస‌గా నాలుగు రోజు కూడా మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గింది. నోవెల్ క‌రోనా వ‌ల్ల కొత్తగా మృతిచెందిన వారి సంఖ్య 637గా ఉన్న‌ట్లు సోమ‌వారం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మార్చి 24వ తేదీ నుంచి ఇది అత్య‌ల్ప సంఖ్య కావ‌డం విశేషం.  గ‌త గురువారం స్పెయిన్‌లో అత్య‌ధికంగా 950 మంది ఒకే రోజు మ‌ర‌ణించారు. కొత్త‌గా ఆ దేశంలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 4273గా ఉన్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి మొత్తం సంఖ్య 13,055గా ఉంది.  

యూరోప్‌లో ఎక్క‌వ క‌రోనా కేసులు నమోదు అయ్యింది స్పెయిన్‌లోనే. కానీ తాజా డేటాతో ఆ వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. బ‌హుశా లాక్‌డౌన్ చ‌ర్య‌లు క‌ఠినంగా అమ‌లు చేయ‌డం వ‌ల్ల మ‌ర‌ణాల రేటు త‌గ్గిన‌ట్లు భావిస్తున్నారు.  అయితే ప్ర‌భుత్వం మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం లేదు.  ఒక‌వేళ క్వారెంటైన్ రోజులు ముగిసినా.. ప్ర‌జ‌లు క‌చ్చితంగా మాస్క్‌లు ధ‌రించి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచించింది.  

ఇట‌లీలో కూడా ఇదే ట్రెండ్ క‌నిపిస్తున్న‌ది.  ప్ర‌స్తుతం అత్య‌ధిక మ‌ర‌ణాలు చోటుచేసుకున్న దేశం ఇట‌లీనే.  ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 15,887 మంది మ‌ర‌ణించారు. వైర‌స్ సంక్ర‌మ‌ణ‌, మ‌ర‌ణాల సంఖ్య రోజు రోజుకూ త‌గ్గుతున్న‌ది. తీవ్ర ప్ర‌భావానికి గురైన లాంబార్డీ ప్రాంతంలోనూ చికిత్స తీసుకుంటున్న‌వారి సంఖ్య కూడా త‌గ్గుతున్న‌ట్లు అధికారులు చెప్పారు. అయితే లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఎప్పుడు ఎత్తివేస్తామ‌న్న విష‌యాన్ని మాత్రం ప్ర‌ధాని గుసెప్పొ కాంటో తెలుప‌లేదు. logo