శనివారం 06 జూన్ 2020
International - May 11, 2020 , 10:04:39

అమెరికాలో 80 వేలు దాటిన మృతుల సంఖ్య‌

అమెరికాలో 80 వేలు దాటిన మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 80 వేలు దాటింది.  గ‌త 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల 876 మంది ప్రాణాలు కోల్పోయారు.  గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌తి రోజూ అమెరికాలో వెయ్యి మంది మ‌ర‌ణిస్తున్న విష‌యం తెలిసిందే.  అమెరికాలో అత్య‌ధిక స్థాయిలో వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 13,66,962 మందికి వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. అమెరికాలో రిక‌వ‌ర్ అయిన కేసుల సంఖ్య 210684గా ఉన్న‌ది. తాజా మ‌ర‌ణాల సంఖ్య‌తో అమెరికాలో మ‌ర‌ణాల రేటు 5.9 శాతంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 4024009గా ఉన్న‌ది. దీంట్లో 279311 మంది మ‌ర‌ణించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణాల రేటు 6.9 శాతం ఉన్న‌ది.


logo