ఆదివారం 31 మే 2020
International - Apr 06, 2020 , 17:30:44

ఈక్విడార్‌లో దారుణం.. రోడ్డు పక్కనే కరోనా మృతదేహాలు

ఈక్విడార్‌లో దారుణం.. రోడ్డు పక్కనే కరోనా మృతదేహాలు

కరోనా వైరస్ ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ముఖ్యంగా ద‌క్షిణ అమెరికా దేశం ఈక్విడార్‌లో వేగంగా విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలో అక్క‌డ క‌రోనా ఘ‌ట‌న‌లు హృద‌య‌విదార‌క ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఎంతలా అంటే క‌రోనా మ‌హ‌మ్మారితో మ‌ర‌ణించిన వారికి స్థ‌లం దొరక్క‌పోవ‌డంతో ఈక్విడార్‌లో రోడ్డుప‌క్క‌నే శ‌వాల‌ను వ‌దిలేస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారిని బాక్సుల్లోనూ, బ్లాస్టిక్ కవర్లలోనూ చుట్టేసి రోడ్లపై వదిలేస్తున్నారు. ఇప్పటి వరకు ఈక్విడార్‌లో 3,500లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చనిపోయిన వారి సంఖ్య రెండు వందల లోపులోనే ఉన్నా... వీరికి దహన సంస్కారాలు మాత్రం జరగడం లేదు. వైరస్ వస్తుందన్న భయంతో కుటుంబ సభ్యులు కూడా మృతదేహాల దగ్గరకు వెళ్లడం లేదు. 


logo