శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 14, 2020 , 16:39:48

డెట్రాయిల్ హాస్పిట‌ల్లో.. పేరుకుపోయిన మృత‌దేహాలు

డెట్రాయిల్ హాస్పిట‌ల్లో.. పేరుకుపోయిన మృత‌దేహాలు


హైద‌రాబాద్‌: అమెరికాలోని డెట్రాయిట్‌లో ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఆ న‌గ‌రంలోని సినాయ్ గ్రేస్ హాస్పిట‌ల్లో.. శ‌వాలు గుట్ట‌లుగా ప‌డి ఉన్నాయి.  క‌రోనా వైర‌స్ కేసులు ఎక్కువ‌వ‌డంతో.. మ‌ర‌ణించిన వారినే మార్చురీలోనే ఉంచుతున్నారు.  మార్చురీలో ఉన్న రీఫ్రిజిరేటెడ్ రూమ్‌తో పాటు స్ట‌డీ రూమ్‌లోనూ శ‌వాల‌ను దాచిపెడుతున్నారు.  రాత్రిపూట మార్చురీ ఉద్యోగులు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో.. ఆ శ‌వాల‌ను త‌ర‌లించేవారు దొర‌క‌డంలేదు. దీంతో కొత్త‌గా సంభ‌విస్తున్న మ‌ర‌ణాల‌కు సంబంధించిన మృత‌దేహాల‌ను హాస్పిట‌ల్‌లోని వివిధ రూముల్లోకి త‌ర‌లిస్తున్నారు. అమెరికాకు చెందిన ఓ టీవీ ఛాన‌ల్ ఈ ఫోటోల‌ను రిలీజ్ చేసింది. ఆ హాస్పిట‌ల్లో ప‌నిచేస్తున్న ఎమ‌ర్జెన్సీ వ‌ర్క‌ర్లు కూడా ఈ ఫోటోల‌ను ద్రువీక‌రించారు. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 6 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సంక్ర‌మించింది. దాంట్లో 23 వేల మంది మ‌ర‌ణించారు.logo