e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News వ్యాక్సిన్ మిక్సింగ్‌పై సౌమ్యా స్వామినాథ‌న్ వార్నింగ్‌..

వ్యాక్సిన్ మిక్సింగ్‌పై సౌమ్యా స్వామినాథ‌న్ వార్నింగ్‌..

వ్యాక్సిన్ మిక్సింగ్‌పై సౌమ్యా స్వామినాథ‌న్ వార్నింగ్‌..

జెనీనా: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ప్ర‌మాద‌క‌ర ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌న్నారు. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రూ త‌మ‌కు న‌చ్చిన రీతిలో వ్యాక్సిన్లు తీసుకోవ‌ద్దు అని తెలిపారు. ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌లు సూచించిన టీకాల‌ను మాత్ర‌మే వేసుకోవాల‌ని ఆమె చెప్పారు. జెనీవా నుంచి ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. వ్యాక్సిన్ల‌ను మిక్స్ చేయ‌డం వ‌ల్ల కానీ, మ్యాచింగ్ చేయ‌డం వ‌ల్లే క‌లిగే ప‌రిణామాల‌పై ఎటువంటి డేటా అందుబాటులో లేద‌ని ఆమె వెల్ల‌డించారు. ఈ అంశంపై అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయ‌ని, వాటి డేటా కోసం ఎదురుచూస్తున్నామ‌ని ఆమె చెప్పారు. వ్యాక్సిన్ మిక్సింగ్ వ‌ల్ల క‌లిగే రోగ‌నిరోధ‌క శ‌క్తి, ర‌క్ష‌ణ అంశాల‌ను ప‌రిశీలించాల్సి ఉంద‌న్నారు. ఒక‌వేళ ప్ర‌జ‌లే త‌మ‌కు న‌చ్చిన నిర్ణ‌యాలు తీసుకుంటే… అప్పుడు ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంద‌ని, రెండ‌వ.. మూడ‌వ‌.. నాలుగ‌వ డోసులు తీసుకోవాల‌న్న ఆలోచ‌న స‌రికాద‌న్నారు.

సింగిల్ డోసు జాన్సెన్ టీకా తీసుకున్న వారు .. బూస్ట‌ర్ డోసు రూపంలో మ‌రో కంపెనీ టీకాను వేయించుకోవ‌చ్చు అని ఇటీవ‌ల ఓ శాస్త్ర‌వేత్త తెలిపారు. జాన్సెన్ టీకా తీసుకున్న వారు.. ఫైజ‌ర్ లేదా మోడెర్నాకు చెందిన ఎంఆర్ఎన్ఏ టీకాను వేసుకోవాల‌న్నారు. అత్యంత ప్ర‌మాద‌క‌రంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ఇదే కీల‌క‌మ‌ని ప‌రిశోధ‌కురాలు ఏంజిలా రాస్‌మూసెన్ తెలిపారు. ఏప్రిల్‌లో జాన్సెన్ టీకా తీసుకున్న తాను.. మ‌ళ్లీ ఫైజ‌ర్ టీకా బూస్ట‌ర్‌గా వేసుకున్న‌ట్లు చెప్పారు. జాన్సెన్ తీసుకున్న‌వారంతా నాలాగే బూస్ట‌ర్ డోసు తీసుకోవాల‌ని సూచించారు. దీని ప‌ట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇదే కాదు.. బూస్ట‌ర్ డోసు రూపంలో మూడ‌వ ఫైజ‌ర్ డోసు తీసుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఆమె ప్ర‌భుత్వాల‌ను అభ్య‌ర్థించారు. దీని ప‌ట్ల కూడా డ‌బ్ల్యూహెచ్‌వో వ్య‌తిరేక వ్య‌క్తం చేసింది. వ్యాక్సిన్ మిక్సింగ్‌, మ్యాచింగ్ స‌రికాద‌న్నారు. బూస్ట‌ర్ డోసుల‌ను పేద దేశాల‌కు త‌ర‌లించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ సంప‌న్న దేశాల‌ను కోరారు.

- Advertisement -

వ్యాక్సిన్ మిక్సింగ్ వ‌ద్దు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చినా.. కెన‌డా మాత్రం ఆ బాట‌లోనే ముందుకు వెళ్లేందుకు సిద్ద‌మైంది. టీకాల మిక్సింగ్‌ను ఆ దేశం స‌మ‌ర్థించుకున్న‌ది. ఒక‌వేళ రెండ‌వ డోసు అందుబాటులో లేకుంటే, అప్పుడు ఫైజ‌ర్ లేదా మోడెర్నా టీకాల్లో ఏదైనా వేసుకోవ‌చ్చు అని వ్యాక్సినేష‌న్‌పై కెన‌డా జాతీయ స‌ల‌హా క‌మిటీ పేర్కొన్న‌ది. ఈ నేప‌థ్యంలోనూ సౌమ్యా వార్నింగ్ ఇచ్చారు. అయినా మిక్సింగ్‌పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కెన‌డా తేల్చి చెప్పింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ్యాక్సిన్ మిక్సింగ్‌పై సౌమ్యా స్వామినాథ‌న్ వార్నింగ్‌..
వ్యాక్సిన్ మిక్సింగ్‌పై సౌమ్యా స్వామినాథ‌న్ వార్నింగ్‌..
వ్యాక్సిన్ మిక్సింగ్‌పై సౌమ్యా స్వామినాథ‌న్ వార్నింగ్‌..

ట్రెండింగ్‌

Advertisement