బుధవారం 03 జూన్ 2020
International - Apr 25, 2020 , 18:27:03

బ్రెజిల్‌లో ప్రమాద‌ర‌క‌రంగా ప‌రిస్థితులు

బ్రెజిల్‌లో ప్రమాద‌ర‌క‌రంగా  ప‌రిస్థితులు

బ్రెజిల్‌లో క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తోంది. అంతకంత‌కూ కేసులు పెరుగుతుండ‌టంతో  అక్కడి ఆసుపత్రులు స్థాయికి మించి సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో  కొత్త కేసులను చేర్చుకోలేమంటూ ఆసుపత్రులు చేతులెత్తేశాయి. ఇక మృతిచెందిన వారితో శ‌వగారాలు, స్మ‌శాన‌వాటిక‌లు నిండిపోతున్నాయ‌ని సిబ్బంది ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా  రాజధాని నగరం రియో డి జనీరోలో ఏ ఆసుపత్రి చూసినా కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి.

 అటు ఇత‌ర న‌గ‌రాల్లోనూ క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. కాగా ఇప్ప‌టివ‌ర‌కు బ్రెజిల్‌లో క‌రోనా కేసుల సంఖ్య 52,995 కాగా, మృతుల సంఖ్య 3600కు చేరింది. మరోవైపు శ్మశాన వాటికలు సైతం కరోనా మృతుల తాకిడి ఎదుర్కొంటున్నాయి. మానాస్ సిటీలో భారీ గోతులు తీసి వాటిలో సామూహిక ఖననం చేస్తున్నారు. అయితే బ్రెజిల్‌ పరిస్థితులు ఇలా ఉంటే అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో మాత్రం తేలిగ్గాతీసుకుంటున్నారు. క‌రోనా కట్ట‌డికి భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, ముప్పు ఉన్నవారిని ఐసోలేషన్ చేస్తే సరిపోతుందని అంటున్నారు.


logo