గురువారం 26 నవంబర్ 2020
International - Nov 07, 2020 , 15:25:57

డెయిరీలో పాలతో స్నానం చేశాడు.. కటకటాల పాలయ్యాడు!

డెయిరీలో పాలతో స్నానం చేశాడు.. కటకటాల పాలయ్యాడు!

ఇస్తాంబుల్‌: అతడు పాడి కార్మికుడు. పాల డెయిరీలో పనిచేస్తాడు. ఏం అనిపించిందో ఏమోగానీ బాత్‌టబ్‌లో పాలు పోసుకుని స్నానం చేశాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. 

ఈ వింతైన సంఘటన టర్కీలో జరిగింది. ఉగుర్‌ టుట్గట్‌ అనే పాడి కార్మికుడు ఈ పని చేశాడు. అతడు టబ్‌లో పడుకొని మగ్గుతో పాలను తలపై పోసుకున్నాడు. దీన్ని మరో వ్యక్తి వీడియో తీశాడు. సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు.  ఈ విషయం కాస్తా పోలీసులకు చేరగా, వారు వచ్చి ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు కొన్యా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ధృవీకరించింది. పోలీసులు దర్యాప్తు జరిపిన తర్వాత డెయిరీ అధికారులతోపాటు ఇద్దరు కార్మికులకు స్థానిక అధికారులు జరిమానా విధించారు. పాడి కేంద్రం నుంచి పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మానవ భద్రతకు ప్రమాదం ఉందని భావించినందున డెయిరీని కూడా మూసివేశారు.  

 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.