శనివారం 04 జూలై 2020
International - Jun 06, 2020 , 11:22:42

అమెరికాలో రోజూ వెయ్యికిపైగా మ‌ర‌ణాలు.. 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు

అమెరికాలో రోజూ వెయ్యికిపైగా మ‌ర‌ణాలు.. 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌తోపాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతూ వ‌స్తున్న‌ది. స‌గటున రోజుకు 1000 మ‌ర‌ణాలు, 20,000 కేసులు న‌మోద‌వుతున్నాయి. శుక్ర‌వారం కూడా కొ్త్త‌గా 922 క‌రోనా మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో చోటుచేసుకున్న మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,09,042కు చేరింది. అదేవిధంగా అమెరికాలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 18,90,000 దాటింది. 

కాగా, ప్ర‌పంచంలో అత్యధిక క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించిన దేశాల జాబితాలో అమెరికా అగ్ర‌స్థానంలో ఉన్న‌ది. ఆ త‌ర్వాత ఫ్రాన్స్‌, ఇట‌లీ, స్పెయిన్ దేశాల్లో భారీ సంఖ్య‌లో క‌రోనా మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. కాగా, అమెర‌కాలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 4,91,000 మంది వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే, ఏప్రిల్ నెల మ‌ధ్య ప్రాంతంలో దేశంలో రోజుకు 3,000 మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని, ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికి త‌గ్గింద‌ని అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను మ‌రింత స‌డ‌లించాల‌ని అన్ని రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌ను ట్రంప్ మ‌రోసారి కోరారు.   ‌ 


logo