శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 11, 2020 , 15:04:43

క‌రోనా కాదు.. 'సైటోకైన్ స్టార్మ్' చంపేస్తోంది !

క‌రోనా కాదు.. 'సైటోకైన్ స్టార్మ్' చంపేస్తోంది !

హైద‌రాబాద్‌: సైటోకైన్ స్టార్మ్‌. క‌రోనా వైర‌స్ మ‌ర‌ణాల‌కు ఇదో కార‌ణ‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు.  సంక్లిష్ట‌మైన కేసుల్లో వైర‌ల్ లోడ్ వ‌ల్ల కాకుండా.. సైటోకైన్ ప్ర‌భంజ‌నం వ‌ల్ల చ‌నిపోతున్న‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌స్తున్నారు.  క‌రోనా వైర‌స్ సోకిన పేషెంట్ల‌లో ప‌ది శాతం మంది సైటోకైన్ స్టార్మ్‌తో ఇబ్బందిప‌డుతున్నారు.  సైటోకైన్లు అంటే ప్రోటీన్లు. ఇవి రోగ‌నిరోధ‌క శ‌క్తిలో భాగమే. కానీ రోగ‌నిరోధ‌క శ‌క్తి తిర‌గ‌బ‌డితే.. అప్పుడు సైటోకైన్ ప్ర‌భంజ‌నం ఏర్ప‌డుతుంది. దాని వ‌ల్ల భారీ ఎత్తున మాన‌వ దేహంలోకి సైటోకైన్లు రిలీజ్ అవుతాయి. ఆ రిలీజైన సైటోకైన్ల వ‌ల్లే మ‌నుషులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న‌ట్లు స్పెయిన్ డాక్ట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అధిక మోతాదులో రిలీజైన సైటోకైన్లు.. వివిధ శ‌రీరా అవ‌య‌వాల‌ను నాశ‌నం చేస్తున్నాయి. అందుకే క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తులు భిన్న ల‌క్ష‌ణాల‌తో మ‌ర‌ణిస్తున్నార‌ని బార్సిలోనా బెలివిట్జ్ హాస్ప‌ట‌ల్ డాక్ట‌ర్ ర‌ఫేల్ మ‌నేజ్ తెలిపారు.

శ‌రీరంలో ఏర్ప‌డే ఇన్‌ఫెక్ష‌న్ల వ‌ల్ల‌, లేదా కొన్ని డ్ర‌గ్స్ వాడ‌డం వ‌ల్ల .. సైటోకైన్లు ఉత్ప‌త్తి అవుతుంటాయి. అయితే వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ లేద‌ని ఆ డాక్ట‌ర్ తెలిపారు.  సైటోకైన్లు అధికంగా రిలీజ్ కావ‌డం వ‌ల్ల అవ‌య‌వాలు నిర్జీవ‌మైపోతాయి.  అవి తీవ్ర‌మైన వాపుకు లోన‌వుతాయి. ఈ ద‌శ‌లో మ‌న‌కు ఎటువంటి చికిత్స‌లేద‌ని, వైర‌స్‌కు కానీ, లేక వాపుకు కానీ చికిత్స లేద‌ని డాక్ట‌ర్ మ‌నేజ్ చెప్పారు. సాధార‌ణంగా ఫ్లూ సీజ‌న్‌లో సైటోకైన్ స్టార్మ్ ఉంటుంది, కానీ అవి క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో జ‌రుగుతాయి, అయితే కోవిడ్ 19 మ‌హమ్మారి వ‌ల్ల పేషెంట్లు హాస్ప‌ట‌ళ్ల‌కు వ‌స్తున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.  మ‌నిషిలో రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా కాక‌పోయినా, స‌మ‌తుల్యంగా ఉంటే బెట‌ర్ అని ఆయ‌న తెలిపారు. 

ఏదైనా అవ‌యవం దెబ్బ‌తింటే, అప్పుడు రోగ‌నిరోధ‌క శ‌క్తి ప‌నిచేస్తుంది.  మ‌న‌లో రిలీజైన సైటోకైన్లు పాడైన క‌ణాల‌ను చంపేస్తాయి. దాంతో డామేజైన క‌ణాల‌కు రిపేర్ జ‌రుగుతుంది. కానీ కోవిడ్ కేసులో సైటోకైన్లు ట‌న్నుల కొద్దీ రిలీజ‌వుతున్నాయి. దీంతో కీల‌క‌మైన శ‌రీర భాగాల్లో అవి వాపుకు దారి తీస్తున్నాయి. దాని వ‌ల్లే కిడ్నీలు, గుండెపోటు లాంటి మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌ట్లు డాక్ట‌ర్ ప‌ర‌దేస్ తెలిపారు. కొంద‌రు పేషెంట్ల‌కు తీవ్ర‌మైన త‌ల‌నొప్పి వ‌స్తోంద‌ని, వారికి మెద‌డువాపు వ్యాధి వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. కొన్ని కేసుల్లో కేంద్ర నాడీవ్య‌వ‌స్థ కూడా దెబ్బ‌తింటున్నట్లు గ్ర‌హించామ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. నాడీ వ్య‌వ‌స్థ స‌రిగాప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కొంద‌రిలో శ్వాస‌కోస ఇబ్బందులు త‌లెత్తుతున్న‌ట్లు గుర్తించారు. వాస‌న‌, రుచిని ప‌సిగ‌ట్ట‌క‌పోవ‌డం కూడా ఓ స‌మ‌స్య‌గా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. ఇటలీలోని బ్రెసికా వ‌ర్సిటీలో న్యూరో సంబంధిత రుగ్మ‌త‌ల‌ను ట్రీట్ చేసేందుకు ప్ర‌త్యేక హాస్ప‌ట‌ల్‌ను ఏర్పాటు చేశారు. వుహాన్‌లో జ‌రిగిన స్ట‌డీ ఆధారంగా 37 శాతం మంది పేషెంట్ల‌కు నాడీ సంబంధిత వ్యాధులు ఉత్ప‌న్న‌మైన‌ట్లు గుర్తించారు.
logo