సైకిల్‌పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..

పారిస్ : ఫ్రైంచ్ సైక్లిస్ట్ అసాధారణ ఫీట్‌తో ఔరా అనిపించాడు. ౩౩ అంతస్తులను సైకిల్‌పై అవలీలగా అరగంటలోనే చేరుకున్నాడు. సైక్లిస్ట్, మౌంటెన్ బైకర్ అరిలిన్ ఫాంటెనయ్ ట్రినిటీ టవర్‌లో ౩౩ అంతస్తుల్లోని 768 మెట్లను కాలిని కిందపెట్టకుండా సైకిల్‌పైనే ఎక్కాడు. ౩౩వ ఫ్లోర్‌కు చేరుకున్న తర్వాత కాలు కిందపెట్టిన అరిలిన్ సైకిల్‌ను తన భుజాలపైకి ఎత్తుకున్నాడు. పుటిక్స్లో కొత్తగా ప్రారంభమైన ఆకాశహార్మ్యం ట్రినిటీ టవర్ అరిలిన్ అసాధారణ టాస్క్‌కు వేదికగా నిలిచింది.
అరిలిన్ ౩౩ అంతస్తులను సైకిల్‌పై చేరుకున్న వీడియో వైరల్ అవుతోంది. చివరి అంతస్తును చేరుకునే సమయంలో మెటల్ ఫ్లోరింగ్ జారుడుగా ఉండటంతో కొంత తడబడినట్టు వీడియోలో కనిపించింది. ౩౩ అంతస్తులను ఎక్కాలని తాను చేపట్టిన ఛాలెంజ్ విజయవంతమవుతుందని అనుకోలేదని, ఎక్కువ ఫ్లోర్లు ఎక్కుతున్న కొద్దీ తన భుజాలు, కాళ్ల కింద నొప్పి తీవ్రమైందని అరిలిన్ చెప్పుకొచ్చాడు. చివరి అంతస్తుకు చేరుకోగానే ఎలాంటి పొరపాట్లు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్లానని ఈ ఫీట్ సాధించడం పట్ల సంతోషంగా ఉన్నానని అన్నాడు.
తాజావార్తలు
- కమల్‌ను కలుసుకున్న శృతి.. వైరలైన ఫొటోలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం