బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 20, 2020 , 13:41:35

క‌ట్‌, కాపీ, పేస్ట్‌.. సృష్టిక‌ర్త ఇక లేరు

క‌ట్‌, కాపీ, పేస్ట్‌.. సృష్టిక‌ర్త ఇక లేరు

హైద‌రాబాద్‌:  క‌ట్‌, కాపీ, పేస్ట్‌.. లాంటి క‌మాండ్లును రూపొందించిన కంప్యూట‌ర్ శాస్త్ర‌వేత్త‌ లారీ టెస్ల‌ర్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 74 ఏళ్లు.  కంప్యూటర్ అభివృద్ధిలో లారీ టెస్ల‌ర్ ఎంతో కృషి చేశారు.  1960 ద‌శకంలో కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ప‌నిచేసిన టెస్ల‌ర్‌.. సులువైన కంప్యూట‌ర్ క‌మాండ్లను రూపొందించారు. కంప్యూట‌ర్ల విజ్ఞానాన్ని సుల‌భ‌త‌రం చేసిన క‌ట్‌, కాపీ, పేస్ట్ లాంటి క‌మాండ్ల‌ను ఈయ‌నే క‌నుగొన్నారు.  లారీ టెస్ల‌ర్ మృతి ప‌ట్ల జిరాక్స్ కంపెనీ నివాళి అర్పించింది. 1945లో న్యూయార్క్‌లో పుట్టిన టెస్ల‌ర్‌.. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీలో చ‌దివారు. గ్రాడ్యుయేష‌న్ త‌ర్వాత టెస్ల‌ర్‌.. ఇంట‌ర్‌ఫేస్ డిజైన్‌పై దృష్టి పెట్టారు. దీంతో ఆయన కంప్యూట‌ర్ల వినియోగాన్ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా మార్చేశారు. జిరాక్స్ కంపెనీతో పాటు స్టీవ్ జాబ్స్‌తో క‌లిసి యాపిల్ సంస్థ‌లో టెస్ల‌ర్ ప‌నిచేశారు. 

 logo