మంగళవారం 31 మార్చి 2020
International - Mar 15, 2020 , 11:48:05

వినియోగదారుడే రాజు

వినియోగదారుడే రాజు

హైదరాబాద్‌ ‌: మార్కెట్‌లో కొనుగోలుదారుడే కింగ్‌. మనం చేసే ప్రతి రూపాయి ఖర్చుకి వినియోగదారుల చట్టం రక్షణ కల్పిస్తున్నది. మోసం జరిగితే అమ్మకం, తయారీదారుల నుంచి పరిహారం వసూలు చేస్తుంది. బిస్కెట్‌ ప్యాకెట్‌ నుంచి బంగారం వరకు ఏ వస్తువు కొనుగోలు అయినా చట్టబద్ధంగా (బిల్లుతో) జరిగినప్పుడు ఆ వస్తువు వినియోగంలో లోపం ఎదురైతే దానికి బాధ్యుడు అమ్మ కం, తయారీదారుడే. ఫోరాన్ని ఆశ్రయిస్తే రూపాయి ఖర్చు లేకుండా న్యాయం పొందే వీలుంది.

మూడు దశాబ్దాల క్రితమే..

వినియోగదారుల హక్కుల రక్షణకు 1986లోనే ప్రభుత్వం చట్టం చేసింది. మూడు దశాబ్దాలు దాటినా ఈ చట్టం పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రావడంలేదు. అవగాహన రాహిత్యమే ఇందుకు ప్రధాన కారణం. ఇందుకోసం వినియోగదారుల ఫోరం ఏర్పాటై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా ప్రతిఫలం మాత్రం ఆశించిన స్థాయిలో రావడంలేదు.

20లక్షల పరిహారం..

వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లితే న్యా యం చేయాలని కోరుతూ వారు జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చు. ఇందుకు వినియోగదారుడు సరైన ఆధారాలు కలిగిఉండాలి. వస్తువు లేదా సేవకు సంబంధించిన బిల్లు, గ్యారంటీ, వారంటీ కార్డులుండాలి. ఎవరిపై ఫిర్యాదు చేస్తున్నామో వారిని ముందు సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే ఫోరాన్ని ఆశ్రయించాలి. జిల్లా కోర్టు ల సముదాయంలో వినియోగదారుల ఫోరం1, 2 ఉన్నాయి. ఇందులో కేవలం తెల్ల కాగితంపై ఫిర్యాదును రాసి ఇస్తే దాన్ని ఫోరం స్వీకరిస్తుంది. ఒకవేళ నేరం రుజువైతే 20లక్షల వరకు పరిహారం పొందవచ్చు.

నాణ్యత తప్పనిసరి

ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న ఏ ఉత్పత్తి అయినా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఐఎస్‌ఐ అనుమతిలేకుండా ఆ మార్క్‌ వేసుకున్నారని తెలిసినా, ఐఎస్‌ఐ మార్క్‌ ఉండి నాణ్యత లేని ఉత్పత్తులు విక్రయించినా ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో దీని విభాగం ఉంది. ఆహార పదార్థాలపై అగ్‌మార్క్‌ ఉండాలి.

* హోల్‌మార్క్‌ బంగారం అని చెప్పి మామూలు బంగారాన్ని ఎవరైనా అంటగడితే ఫిర్యాదు చేయవ చ్చు. హోల్‌మార్క్‌ లోగో అంటే ఏడాది కోడ్‌. షాపు లైసెన్స్‌ నంబర్‌, అసెస్‌మెంట్‌ నంబర్‌ ఉండాలి.

* ఆహార పదార్థాల్లో నాణ్యత లేకుంటే జిల్లా ఫుడ్‌ కంట్రోలర్‌ దృష్టికి తీసుకెళ్లాలి.

పండ్ల నిల్వ, మాగ బెట్టేందుకు హానికర రసాయనాలు వాడకూడదు. అలాంటి సమస్య ఎదురైతే ఫుడ్‌సెప్టీకి ఫిర్యాదు చేయవచ్చు.

ఏదైనా వస్తువును గరిష్ట చిల్లర ధరను మించి అమ్మకూడదు. సాధారణ షాపులే కాదు, రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లలోనూ ఈ నిబంధన వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాదారులుగా సమస్యలపై ఫిర్యాదు చేసే హక్కు ఉంది. ఏటీఎంలో డబ్బు రాకున్నా, ఖాతాలో డబ్బు మాయమైనా ఫిర్యాదు చేసిన వారంరోజుల్లో డబ్బు జమకావాలి. లేదంటే రోజుకి వంద చొప్పున అధికారులు చెల్లించాలి.

సినిమా హాల్‌లో వాహన పార్కింగ్‌ ఫీజు వసూలు చేయకూడదు. నేషనల్‌ కన్స్యూమర్‌ కమిషన్‌, ఢిల్లీ విభాగం ఇటీవలే ఆదేశాలిచ్చింది. ఎవరైతే చార్జి వసూలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చు.


logo
>>>>>>